Tunnel Assembly To Red Fort
Tunnel Assembly to Red Fort: ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకూ ఉన్న సొరంగం బయటపడింది. గురువారం అనుకోకుండానే ఈ రహస్యం బయటపడింది. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రిటీషుల కాలంలో ఫ్రీడం ఫైటర్స్ ను ఎదుర్కొనేందుకు ఈ సొరంగం ఉపయోగించేవారని అన్నారు.
‘1993లో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. ఈ సొరంగం గురించి మాట్లాడుకునేవాళ్లు కానీ, అప్పుడు ఆచూకీ తెలియలేదు. ఇప్పుడే దీనిపై క్లారిటీ వచ్చింది’ అని గోయెల్ అన్నారు.
ఇప్పుడే సొరంగం ముఖ ద్వారం కనిపించింది. దీనిని తవ్వేందుకు పరిస్థితులు సహకరించడం లేదు. ఎందుకంటే మార్గంలో మున్ముందు భాగం మెట్రో ప్రాజెక్టులు.. మరి కొన్నింటి కారణంగా పాడై పోయి ఉండొచ్చని అన్నారు.
1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మార్చారు. ఆ తర్వాత దానిని 1926లో కోర్టుగా మార్చారు. బ్రిటీషర్లు ఫ్రీడం ఫైటర్ల నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఈ సొరంగం వాడుకునేవారని ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.
ఇక్కడ ఉరి వేయడానికి ఉపయోగించే గదికి తాళం వేసి ఉండేది. దానిని నేనెప్పుడు ఓపెన్ చేయలేదు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇన్ స్పెక్ట్ చేయాలని భావించా. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు ఓపెన్ చేశాం. ఫ్రీడం కోసం జరిపిన పోరాటంలో ఈ ప్రదేశానికి చాలా గుర్తింపు ఉంది. మన దేశంలోని టూరిస్టులు, విజిటర్ల కోసం దీనిని వచ్చే సంవత్సరం వరకూ తెరిచే అవకాశాలున్నట్లు వివరించారు.