Friendship parrot : స్కూల్ పిల్లలతో దోస్తీ చేస్తున్న చిలకమ్మ..‘నువ్వూ నేను ఓ జట్టు’అంటోంది

ఓ చిలకమ్మ చిన్నారులతో దోస్తీ చేస్తోంది. స్కూలుకు వచ్చే పిల్లలతో స్నేహం చేస్తోంది.వారి భుజాలపై వాలుతుంది?వారి ముఖంలో ముఖం పెట్టి..నువ్వు నేను ఓ జట్టు అంటోంది.

Friendship parrot with school children : చిలుక. రామ చిలుక అని కూడా అంటాం. లేక ఆకుపచ్చ రంగుతో ఎర్రని ముక్కుతో చూడముచ్చటగా ఉండే చిలకలను అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. జామపండ్లు తినే చిలకమ్మను పట్టుకుందామని ముచ్చటపడితే తుర్రుమంటూ ఎగిరిపోతుంది. చిలక అందంలోనే కాదు పలుకుల్లో కూడా చక్కనిదే. గారాలు పోతున్నట్లుగా పలికే చిలుక పలుకులు వింటుండిపోవాలనిపిస్తుంది కదూ. అలాగే దాన్ని పట్టుకుని ముద్దు చేయాలనిపిస్తుంది. కానీ పట్టుకుంటే దొరకదే..ఏదోక సందర్భంలో పట్టుకున్నామో..ఎర్రని పదునైన ముక్కుతో లటుక్కున కొరికి చిటుక్కున తుర్రుమని ఎగిరిపోతుంది.

అటువంటి చక్కదనాల ఓ చిలకమ్మ చిన్నారులతో దోస్తీ చేస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ్వాలియ‌ర్‌లో శ‌ర్దా బాల్‌గ్రామ్ ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ సమీపంలోనే ఒక స్కూల్ ఉంది. ప్ర‌తిరోజూ ఆ స్కూలుకు వచ్చిపోయే పిల్ల‌ల‌తో ఈ రామచిలుక మ‌స్తు మ‌జా చేస్తుంది. స్కూలుకు వచ్చిపోయే పిల్లలతో దోస్తానా చేస్తు సందడి చేస్తోంది. స్కూలు వచ్చే పిల్లల భుజాలపై వాలుతుంది. వారి ముఖంలో ముఖంపెట్టి చూస్తుంది ‘నువ్వూ నేను ఓ జట్టు’ అన్నట్లుగా..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ చిలుక స్కూలుకు వచ్చిపోయే పిల్లలతో ఆటలాడుతోంది.చిన్నారుల భుజాలపై వాలి ముఖంలో ముఖంపెట్టి చూసే ఆ చిలకమ్మ పిల్లల తలపై వాలుతుంది. వారిని ఆటపట్టిస్తుంది. ఏ మాత్రం భయపడకుండా వారి ముఖాల్లోకి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తుంది. చిలుక పలుకులతో చిన్నారుల్ని ఆకట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు