కరోనా వైరస్ విజృంభిస్తుంటే లోకల్ బాబాలు చాలా మంది సొంత వైద్యం అని, మరికొందరు తామే మందు కనిపెట్టేశామంటూ బలైపోయారు. మహమ్మారి ముందు తోక ఝాడించిన వారందరి గతి అదోగతిగా తయారైంది. ఇటీవల కరోనాకు ముద్దులతో మందేసిన బాబా పరిస్థితి అలాగే ఉంది. భక్తుల చేతికి ముద్దు పెట్టి కరోనాను తాను అంటించుకోవడమే కాక ఇతరులకు అంటించాడు.
మధ్యప్రదేశ్‌లోని రాట్లమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చాలా మంది భక్తులకు ముందు పెట్టే క్రమంలో కరోనా రోగికి ముద్దు పెట్టేశాడు బాబా. ఆరోగ్య శఆఖ సమాచారం ప్రకారం.. రాట్లమ్ జిల్లాలో 85మందికి కరోనా సోకింది. వారిలో నాయపురా ఏరియా నుంచి వచ్చిన 19మందికి బాబా వల్లే కరోనా సోకింది. చేతికి ముద్దు పెట్టి తాను మంత్రం వేస్తానని కరోనా వెళ్లగొడతానని చెప్పాడు.
అతను జూన్ 4న కరోనా వైరస్ తో బాధపడి చనిపోయాడు. ఆ తర్వాతే అతనితో కాంటాక్ట్ అయిన వాళ్ల గురించి వెదకడం మొదలుపెట్టారు. వారిలో 13మంది నాయపురాకు చెందిన వాళ్లే. బాబాతో కాంటాక్ట్ అయిన 24 మందిని హాస్పిటల్ లో చేర్పించారు. ఆ జిల్లాలో ప్రస్తుతం 46యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో నలుగురు చనిపోయారు.