మధ్యప్రదేశ్ లో పండే బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు (GI) ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. తమ రాష్ట్రంలో పండించే బాస్మతి బియ్యం విశిష్ఠతను శివరాజ్ సింగ్ చౌహాన్ తోమర్‌కు వివరించారు.
ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. భౌగోళిక గుర్తింపు (geographical indication) అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే.
Read Here>>చైనాకు భూటాన్‌తో మరోసారి సరిహద్దు గొడవ. ఈ సారి టార్గెట్ అరుణాచల్‌ప్రదేశ్