మధ్యప్రదేశ్ సీఎం పదవికి కమల్‌నాథ్ బలపరీక్షకు కొద్ది గంటల ముందే రాజీనామా చేశారు. మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బీజేపీ ఆరోపణలు గుప్పించారు. తనపై, తన పార్టీపై బీజేపీ చేసిన కుట్రలను బయటపెట్టారు. భోపాల్ కేంద్రంగా మాట్లాడుతూ.. ఇదే రోజు గవర్నర్ కు తన రాజీనామాను అందజేయనున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ బలపరీక్షకు ఆదేశించింది.
ప్రభుత్వాన్ని ‘అస్థిరపరిచేందుకు’ బిజెపి కుట్రలు చేసింది. రాష్ట్రాన్ని కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించా. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసింది. మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అత్యాశపరులైన మా ఎమ్మల్యేలతో బీజేపీ చేతులు కలిపింది. కొందరు ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించింది బీజేపీ.
ఈ 15నెలల కాలంలో నేనుచేసిన తప్పేంటి. మెజార్టీ స్థానాలు గెలుపొంది మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలు మాకు అవకాశమిచ్చారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని తిట్టిపోశారు. కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయింది.
రాజకీయాల కోసం బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇచ్చిన 4వందల వాగ్దానాలను నిలబెట్టుకున్నాం. బీజేపీ అలా కాదు. వాళ్లకు లక్ష్యాలు ఉండవు. మేం కూడా మాఫియాకు వ్యతిరేకంగా పనిచేశాం. అది వాళ్లకు నచ్చలేదు. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను ఎప్పటికీ క్షమించరని కమల్‌నాథ్ అన్నారు.
See Also | నేడే కమల్ సర్కారుకు బలపరీక్ష: కమలం నెగ్గేనా? కాంగ్రెస్ గట్టెక్కేనా?