BJP Star Campaigners: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తేజస్వీ సూర్యకు నో చాన్స్.. బీజేపీ నేతలు ఏమన్నారంటే..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించింది. ఇందులో ఎంపీ తేజస్వీ సూర్య పేరు లేకపోవటంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Tejaswi Surya

BJP Star Campaigners: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ రాష్ట్రంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే. మే 10న పోలింగ్, 13న ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ప్రచార పర్వానికి అభ్యర్థులు, బీజేపీ నాయకులు తెరలేపారు. నియోజకవర్గాలలో బీజేపీ నేతలు, అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు రోడ్ షోలతో ప్రచారవేగాన్ని మరింత పెంచనున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు .. 40మందితో క్యాంపైనర్ల లిస్టులో తెలుగువారికి చోటు

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, వివిధ రాష్ట్రాలు, కేంద్ర నుంచి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. . వీరిలో తెలంగాణ రాష్ట్రంకు చెందిన బీజేపీ నేతలు కూడా ఉన్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో బీజేపీ యువ నేత, ఎంపీ తేజస్వి సూర్య పేరులేకపోవటం పార్టీ శ్రేణులనుసైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 32 ఏళ్ల తేజస్వి సూర్య.. బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు. బెంగళూరు సౌత్ పార్లమెంట్ సభ్యుడు. పార్టీ హిదుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే నేత. ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలకు ప్రసిద్ధి చెందిన నేత. అలాంటి వ్యక్తి పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఎందుకు లేరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అతిరథ మహారథులు .. బీజేపీ క్యాంపెయినర్ల లిస్టు విడుదల

బీజేపీ వర్గాల ప్రకారం.. సూర్యను తప్పించడం అనేది పార్టీలో అతని పట్ల ప్రతికూల దృక్పథానికి సంకేతం కాదని పేర్కొంటున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అతను కూడా పాల్గొంటాడని పేర్కొంటున్నారు. కేవలం తన నియోజకవర్గంపై మరింత దృష్టిసారించేందుకు అతనికి వెసులుబాటు కల్పించినట్లని తెలుస్తోంది. మరోవైపు తేజస్వీ సూర్య ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. యువనేతలందరినీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే.. తేజస్వీ సూర్య ఇటీవల ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనుకోకుండా తెరిచారు. విమానం ఆలస్యం అయింది. దీంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో అతను అపహాస్యం పాలయ్యాడు. ఈ ఘటనను బీజేపీ కేంద్ర అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్లు పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

Karnataka Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ

తేజస్వి సూర్య న్యాయవాది, హిందుత్వ రాజకీయ వాది. 28ఏళ్ల వయస్సులోనే లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో  బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి తేజస్వీ ఎన్నికయ్యారు.