Karnataka Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆ పార్టీలో నేతలు ఈపార్టీలోకి ఈపార్టీలోంచి ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా జంపింగ్ లు షురు అయ్యాయి. ఈ జంపింగ్ ల్లో కాషాయదళానికి బిగ్ షాకులే తగులుతున్నాయి.

Karnataka Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ

laxman savadi Joined congress party

Karnataka Elections 2023 : కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టికెట్ రాదనే అసంతృప్తితోనే మరేదో కారణాలతోనే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంట్లో భాగంగానే కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్ ఇవ్వటానికి నిరాకరించటంతో సవాడీ రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేశారు.అనంతరం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలతో సవాడీ భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతు..10మంది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ వారందరికి మా పార్టీలో చోటు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ తన తొలి అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. ఆ మరుసటిరోజే సవాడీ సీటు దక్కలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరారు.

Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చిత్రమైన హామీలు.. ఆసక్తికర విన్యాసాలు

మాజీ సీఎం యడియూరప్ తరువాత కర్ణాటకలో బీజేపీకి చెందిన అత్యంత సీనియర్ లింగాయత్ నాయకులలో సవాడీ ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరటంతో పార్టీ టికెట్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్ సవాడీ కాంగ్రెస్ లో చేరటం బీజేపీకి దెబ్బ అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాగా లక్ష్మణ్ సవాడీ 2018 ఎన్నికల్లో అథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమత్తహల్లిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఒక సంవత్సరం తరువాత కాంగ్రెస్-జనతాదళ సెక్యులర్ ప్రభుత్వం నుంచి సామూహిక ఫిరాయింపుల్లో సవాడీ కీలకంగా వ్యవహరించారు. దానికి ఫలితంగా సవాడీకి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఈ ఫిరాయింపుదారుల్లో ఒకరైన మహేష్ కుమఠహల్లి ఈసారి అథని నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక అయి బరిలో దిగనున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను మహేష్ కుమళహళ్లిపై పోటీగా దిగాలని సవాడీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా తనకు టికెట్ ఇవ్వని బీజేపీ అభ్యర్థిపై గెలవాలని సవాడీ భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ ఆ అవకాశం ఇస్తుదో లేదో వేచి చూడాలి.

Supreme Court: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ముస్లిం రిజర్వేషన్లపై బొమ్మై ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు