Supreme Court: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ముస్లిం రిజర్వేషన్లపై బొమ్మై ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు

ముస్లింలు 100 సంవత్సరాలకు పైగా వెనుకబడ్డారని, వారిని వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీ కోటాలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే రాష్ట్రంలో లింగాయత్‌లు, వొక్కలిగాల ఆధిపత్య వర్గంగానే పరిగణించబడతారు. రాజకీయంగా వీరికి అత్యంత బలం ఉంటుంది.

Supreme Court: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ముస్లిం రిజర్వేషన్లపై బొమ్మై ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు

CM Bommai

Supreme Court: ఓబీసీ కోటాలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినట్లు కొద్ది రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దీన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ విచారించిన దేశ అత్యున్నత ధర్మాసనం.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా తప్పుడు ఊహలతో కూడుకున్నదని స్పష్టం చేసింది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఈ తీర్పు కారణంగా స్థానిక అధికార భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Gudivada High Tension : గుడివాడలో హైటెన్షన్.. కొడాలి నాని ఆఫీస్ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ

ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను వొక్కలిగాలు, లింగాయత్‌లకు ప్రతి 2 శాతం చొప్పున పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సహా జస్టిస్ పిఎస్ నరసింహ, జెబి పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చంచలమైనదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం ఈ వ్యాజ్యంపై విచారణను ఏప్రిల్ 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Uttar Pradesh: యూపీ ఎన్‭కౌంటర్‭పై అనుమానాలు, విమర్శలు.. ఇంతకీ మాయావతి, అఖిలేష్ ఏమన్నారంటే?

ముస్లింలు 100 సంవత్సరాలకు పైగా వెనుకబడ్డారని, వారిని వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీ కోటాలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే రాష్ట్రంలో లింగాయత్‌లు, వొక్కలిగాల ఆధిపత్య వర్గంగానే పరిగణించబడతారు. రాజకీయంగా వీరికి అత్యంత బలం ఉంటుంది. అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింల రిజర్వేషన్లు తొలగించి ఆధిపత్య వర్గాలకు కేటాయించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి.