Gudivada High Tension : గుడివాడలో హైటెన్షన్.. కొడాలి నాని ఆఫీస్ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ

Gudivada: వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

Gudivada High Tension : గుడివాడలో హైటెన్షన్.. కొడాలి నాని ఆఫీస్ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ

Gudivada

Gudivada High Tension : టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వేళ.. గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గుడివాడలో శరత్ టాకీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. కొడాలి నాని ఆఫీస్ ముందు ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీతో పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను చెదరగొట్టారు. భద్రతను పెంచారు. మరోవైపు చంద్రబాబుకు భద్రతగా ఎన్ఎస్ జీ అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.

చంద్రబాబు గుడివాడ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని కార్యాలయమైన శరత్ టాకీస్ దగ్గర వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకుని అక్కడ ఉండటం పట్ల టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి.

Also Read..Nandamuri Ramakrishna : కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ ఫైర్.. మంచి రోజులు రాబోతున్నాయ్

వైసీపీ శ్రేణులు భారీగా మోహరించిన సమయంలోనే టీడీపీ నేతలు ఆ ప్రాంతం వైపు ర్యాలీగా వచ్చారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాగంటి బాబు తన అనుచరులతో శరత్ టాకీస్ మీదుగా వస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని చెబుతున్నారు. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కావాలనే వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read..Nellore City Constituency: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

టీడీపీ నేతల ఆరోపణలను పోలీసులు ఖండించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దామంటున్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం శరత్ టాకీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

శరత్ టాకీస్ వైసీపీకి అడ్డాగా ఉంది. శరత్ టాకీస్.. మాజీమంత్రి కొడాలి నాని కార్యాలయం అని చెప్పొచ్చు. చంద్రబాబు గుడివాడ పట్టణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు భారీగా టూ వీలర్ ర్యాలీ చేపట్టారు. శరత్ టాకీస్ వైపుగా ర్యాలీ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగడంతో వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కొట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. వైసీపీ జెండా పట్టుకున్న ఓ వ్యక్తి.. టీడీపీ నేతలను దూషిస్తూ అక్కడ హల్ చల్ చేశాడు. అతడిని మాగంటి బాబు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది గొడవకు దారితీసింది. కొంత ఘర్షణకు దారితీసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గుడివాడ పట్టణంలో పలు వివాదాలకు శరత్ టాకీస్ కేంద్రంగా నిలిచింది. గతంలో కూడా శరత్ టాకీస్ కేంద్రంగా అనేక ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తర్వాత బందోబస్తును భారీగా పెంచారు. అదనపు బలగాలను రప్పించారు. మరోవైపు చంద్రబాబు రాక సందర్భంగా గుడివాడ పట్టణం అంతా పసుపుమయమైంది. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా చంద్రబాబుకి ఘన స్వాగతం పలుకుతున్నారు.