Mud Puddling : బురద నుంచి సాల్ట్ సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో వైరల్

Mud Puddling : నేచర్‌లో కొన్ని అందాలు చూస్తుంటే మనసు మైమరచిపోతుంది. అందమైన సీతాకోక చిలుకల గుంపు ఒక చోట చేరితే కన్నుల విందు అనిపిస్తుంది. బురద నుంచి సాల్ట్ సేకరిస్తూ కెమెరాకు చిక్కిన సీతాకోక చిలుకల అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mud Puddling : ప్రకృతిలో (nature) ఆస్వాదించాలే కానీ ఎన్నో అందాలు ఉన్నాయి. పచ్చని మొక్కలు, కొండలు, లోయలు,పక్షులు,పూలు .. ఇంతే కాదు సీతాకోక చిలుకలు (butterflies). గుంపులు గుంపులుగా సీతాకోక చిలుకలు కనిపిస్తే చూడటానికి వావ్ అనిపిస్తుంది. ఇవన్నీ ఓ సందర్భంలో గుంపులుగా చేరతాయి. అదే మడ్ పుడ్లింగ్ (mud puddling). ఈ సందర్భంలో ఒకచోటకి చేరిన సీతాకోక చిలుకల విజువల్ చూపరుల్ని ఆకట్టుకుంటోంది.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

నేచర్ లవర్స్ (nature lovers) ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతుంటారు. వాటిని కెమెరాల్లో బంధించి సంతోష పడతారు. అలా బురద నుంచి ఉప్పును (salt) సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రవీణ్ కస్వాన్ అనే IFS అధికారి ట్విట్టర్ లో ఈ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు. బురద నేలలలో ఉన్న లవణాలు, ఖనిజాలను సీతాకోక చిలుకలు సేకరిస్తాయి. ఇలా సేకరించడాన్ని మడ్ పుడ్లింగ్ అంటారు. ఆడ సీతాకోక చిలుకల్ని ఆకర్షించడానికి మగ సీతాకోక చిలుకలు ఇలా లవణాలు, ఫెరోమోన్లను సేకరిస్తాయట. అలా ఓ చోటకి చేరి లవణాలు సేకరిస్తున్న అందమైన సీతాకోక చిలుకల గుంపు కన్నుల పండుగ చేస్తోంది.

Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్

ఇక ఈ అందమైన వీడియోని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలియని ఒక విషయాన్ని వివరించారు అని కొందరు.. ఈ భూమిపై ఎంతటి అందమైన దృశ్యాలు ఉన్నాయో అని కొందరుకామెంట్లు పెడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు