Indian Students : యుక్రెయిన్ నుంచి మొదలైన భారతీయుల తరలింపు.. ఈ రాత్రికి ముంబైకి చేరుకోనున్న విమానం

యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై బయలుదేరింది. ఎయిర్ ఇండియా 1944 విమానంలో 219 మంది భారతీయులు ముంబై చేరుకోనున్నారు.

Ukraine-Mumbai Airport : యక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా సైనికులతో యుక్రెయిన్ సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా సైన్యాన్ని విరుచుకుపడుతూ వారి ఆయుధాలను ధ్వంసం చేస్తోంది యుక్రెయిన్ సైన్యం.. మూడో రోజు కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకున్న తమ దేశీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. భారత్ సైతం యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలను చేపట్టింది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబీసీతో కలిసి ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై బయలుదేరింది. ఎయిర్ ఇండియా 1944 విమానంలో 219 మంది భారతీయులు ముంబై చేరుకోనున్నారు. భారతీయుల తరలింపును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత విదేశాంగ బృందాలు, 24 గంటలూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.

ఈ రాత్రి 8 గంటలకు మొదటి విమానం :
భారతీయుల తరలింపులో సహకరించిన రొమేనియా ప్రభుత్వానికి , విదేశాంగ శాఖ మంత్రి బొగ్డాన్‌ ఆరెస్కుకి మంత్రి జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో రుమేనియా నుంచి ఈ రాత్రి 8 గంటలకు ఎయిర్ ఇండియా మొదటి విమానం (AI 1944 ) ముంబై చేరుకోనుంది. ఆదివారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున 2:30 గంటలకు మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకోనుంది. ఒక్కో విమానంలో 235 నుంచి 240 మంది విద్యార్థులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియాకు రానున్న విద్యార్థుల్లో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులంతా బస్సుల్లో బుకారెస్టు విమానాశ్రయం చేరుకోవడం ఆలస్యం అవుతోంది. దీని కారణంగానే ముంబై, ఢిల్లీ, నుంచి విమానాలు ఆలస్యంగా వెళ్లాయని విమానయాన వర్గాలు వెల్లడించాయి.

Mumbai Airport Makes Special Arrangements For Indian Students Returning From Ukraine

భారత్ వస్తున్న విద్యార్థుల కోసం ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ రిపోర్టులు తప్పనిసరి చేశారు. రెండూ లేనివారికి విమానాశ్రయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కోవిడ్ నెగెటివ్ ఉంటేనే విమానాశ్రయం వీడి వెళ్లేందుకు అనుమతించనున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే ప్రొటోకాల్ ప్రకారమే నడచుకుంటామంటున్న విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సాయంత్రం 4:30కి మరో ఎయిర్ ఇండియా 1939 విమానం బుకారెస్ట్ వెళ్లనుంది.

రుమేనియా నుంచి ముంబైకి విమానం :
భారత ప్రభుత్వ సూచనలతో యుక్రెయిన్ సరిహద్దులకు భారతీయ విద్యార్థులు చేరుకుంటున్నారు. యుక్రెయిన్ నుంచి సుసీవా బార్డర్ దాటి రొమేనియాలోకి వందల సంఖ్యలో చేరుకుంటున్నారు. వీరందరిని బుకారెస్ట్ ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు. వారిని ఇక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి పోరుబ్నే సిరత్ బార్డర్ దాటి 400 మందికి పైగా విద్యార్థులు రుమేనియా చేరుకున్నారని కీవ్‌లో ఇండియన్ ఎంబసీ తెలిపింది. రుమేనియా సరిహద్దుకు చేరుకునే వారందరిని బుకెరెస్ట్‌కు తరలించనున్నారు.


అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలించనున్నారు. వీరిందరిని తిరిగి తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం AI-1942 బయల్దేరి వెళ్లింది. ఈ విమానం ఈ అర్ధ రాత్రి 1.50 గంటల సమయానికి భారత్ చేరుకోనుంది. మరో ఎయిరిండియా AI-1939 విమానం ఈ సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనుంది. ఈ రెండు విమానాల్లో కలిపి 490 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకోనున్నారు. రుమేనియా వెళ్లిన మరో విమానం ఈ సాయంత్రం 4 గంటలకు ముంబైకి చేరుకోనుంది. ఇందులో 240 మంది స్వదేశానికి చేరుకోనున్నారు.

Read Also : Indian Students : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు.. నేడు రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో స్వదేశానికి విద్యార్థులు

ట్రెండింగ్ వార్తలు