బిల్డ‌ర్ భారీమనస్సు: 19 అంత‌స్థుల బిల్డింగ్‌ను క్వారెంటైన్ సెంట‌ర్‌ కు ఇచ్చేసారు

  • Publish Date - June 22, 2020 / 09:30 AM IST

ముంబైకి చెందిన బిల్డర్ మెహుల్ సంఘ్వి పెద్ద మనస్సును చాటుకున్నారు. తాను కొత్త‌గా నిర్మించుకున్న 19 అంత‌స్థుల భ‌వ‌నాన్ని క్వారెంటైన్ సెంట‌ర్‌గా మార్చేశారు,

క్వారెంటైన్ సెంట‌ర్లు లేక ఇబ్బంది ప‌డుతున్న వారికి తనకు తోచిన సహాయం చేయాలనుకున్నారు మెహుల్ సింఘ్వి.తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న మ‌లాడ్ భ‌వ‌నాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇచ్చారు. 

ఈ సందర్భంగా షీజీ శరణ్ డెవలపర్స్ మెహుల్ సింఘ్వి మాట్లాడుతూ..తాను అద్దెకు ఇచ్చినవారితో చర్చించి వారి ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు దీన్ని కొవిడ్‌-19 రోగుల‌కు నిర్బంధ కేంద్రంగా మార్చారు. 

మలాడ్ లోని ఎస్వీ రోడ్ లో ఉన్న ఈ భవనంలో మొత్తం 130 ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని క్వారంటైన్ సెంటర్ గా మార్చటానికి ఇచ్చామని తెలిపారు. దీంతోఇప్పటి వరకూ ఈ భవనంలోకి 300లమంది చేరుకున్నారని తెలిపారు.

కాగా..ఉత్తర ముంబైకు చెందిన ఎంపీ గోపాల్ శెట్టి సింఘ్వితో సంప్రదింపులు జరిపి ఈ భవనాన్నిక్వారంటైన్ సెంటర్ గా మార్చటానికి కృషి చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ..సింఘ్వి  తమ స్వంత ప్రయోజనాలకు పక్కన పెట్టి కష్ట సమయంలో సమాజ సేవ కోసం ముందుకు రావటం సంతోషించాల్సిన విషమయని అన్నారు. 

కాగా..మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనాకేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎంతగా అంటూ శనివారం (జూన్ 21,2020) ఒక్కరోజే మహారాష్ట్రలో 3వేల 874 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1 లక్షా 28వేల 205 కరోనా కేసులు నమోదుకాగా..వారిలో తాజాగా 160మంది మరణించిచటంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5వేల 984కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.

ముఖ్యంగా వాణిజ్య నగరమైన ముంబైలో కొత్తగా 1197 కేసులు నమోదు కాగా..మొత్తం కరోనా కేసులు 65వేల 265కు చేరుకుంది. వారిలో 136మంది ప్రాణాలు కోల్పోయారు.

Read: వాకింగ్ తో 34 కిలోల కొవ్వు కరిగించుకున్న DIG : ఫిట్ నెస్ వెరీ ఇంపార్టెంట్