ముంబైలో 10th పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ప్రతీరోజు ఒక యుద్ధమే. ముంబైలో ఉండే రద్దీ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ విద్యార్ధిని 0th పరీక్ష రాయటానికి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రిక్షాలో వెళ్లాలని అనుకుంది. అలా ఖాట్ రిక్షా స్టాండ్ వద్దకు చేరుకుంది. కానీ ఖాట రిక్షా స్టాండ్ వద్ద ఎప్పుడూలాగానే పెద్ద క్యూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో పాపం ఆ బాలికకు పాలుపోలేదు. ఓ పక్క పరీక్ష టైమ్ దగ్గరపడుతోంది. మరోపక్క వెళ్లలేని స్థితి. దీంతో పరీక్ష రాయలేకపోతానేమోననే భయంతో బాలిక వణికిపోతూ నిలబడింది.
ఆమె పరిస్థితిని ఓ ట్రాఫిక్ పోలీస్ చూశాడు. చేతిలో పరీక్ష కోసం వెళ్లేందు హాల్ టిక్కెట్, ప్యాడ్..పెన్ వంటివి చూసి పరిస్థితి అర్థంచేసుకున్నాడు. వెంటనే ఓ రిక్షాను పిలిచాడు. పోలీస్ పిలిస్తే రాకుండా ఉంటాడా మరి. వెంటనే ఓ రిక్షా వాలా వచ్చాడు. వెంటనే ఆ విద్యార్ధినిని రిక్షా ఎక్కించి పరీక్ష కేంద్రానికి పంపించాడు ట్రాఫిక్ పోలీస్ రాహుల్ రౌత్.
బాలికను సకాలంలో పరీక్ష రాసేందుకు పంపించినందుకు చాలా ఆనందంగా ఉందని రాహల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Witnessed the sweetest, kindest act today.
At Khat Station there’s always a long queue for Rickshaws. A few students nervously waited while going through their notes. You know how last minute glances like these are important.
…
— Rahull Raut (@MisterRatty) March 3, 2020
దీనిపై నెటిజన్లు ట్రాఫిక్ పోలీస్ రాహుల్ రౌత్ ను ప్రశంసిస్తున్నారు. రాహుల్ చేసిన ఈ మంచిపనికి ముంబై పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ట్వీట్ చేసింది. ఓ విద్యార్ధికి తమ డిపార్ట్ మెంట్ వ్యక్తి సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ రాహుల్ ని అభినందించింది. ఈ సందర్భంగా 10th పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు అంటూ తెలిపింది.
See Also | డేంజరస్ ‘సాల్ట్ ఛాలెంజ్’.. టిక్‌టాక్‌లో ట్రెండింగ్
First day of exam has its own share of challenges. We are happy to have been able to help a student in overcoming at least one of them!
Mumbai Police sends best wishes to all the students appearing for SSC Board Exams starting today. #AllTheBest #sscexams @MisterRatty pic.twitter.com/vBut2QVOkk
— Mumbai Police (@MumbaiPolice) March 3, 2020