Viral Video : వేగంగా రైలు..పట్టాలపై మనిషి..తర్వాత ఏం జరిగిందంటే

ముంబై లోకల్ ట్రైన్ డ్రైవర్(మోటర్ మాన్)సకాలంలో స్పందించిన చేసిన పని ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. కొన్ని సెక్లను ఆలస్యం చేసినా ఓ వ్యక్తి ప్రాణాం గాలిలో కలిసిపోయేని, ఆ రైలు డ్రైవర్

Viral Video : వేగంగా రైలు..పట్టాలపై మనిషి..తర్వాత ఏం జరిగిందంటే

Local Train In Mumbai

Updated On : January 3, 2022 / 7:37 PM IST

Train Driver : ముంబై లోకల్ ట్రైన్ డ్రైవర్(మోటర్ మాన్)సకాలంలో స్పందించిన చేసిన పని ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. కొన్ని సెక్లను ఆలస్యం చేసినా ఓ వ్యక్తి ప్రాణాం గాలిలో కలిసిపోయేని, ఆ రైలు డ్రైవర్ అద్భుతం చేశాడంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబై లోని శివ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలో డిసెంబర్‌ 27న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. తనకివే చివరి ఘడియలు అనుకుంటూ రైలు దగ్గరకు వస్తుండంటంతో ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నాడు. అయితే ట్రైన్‌ను నడుపుతున్న మోటర్ మాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని గమనించాడు. వెంటనే అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో రైలు కొంచెం దూరంలో పట్టాలపైనే ఆగిపోయింది.

ఆయుష్షు గట్టిగా ఉండటంతో పట్టాలపై పడుకున్న వ్యక్తి వెంట్రుక వాసిలో గండం నుంచి తప్పించుకుని ప్రాణాలతో వ్యక్తి బయటపడ్డాడు. ఇది గమనించిన ప్లాట్‌ ఫాం దగ్గర ఉన్న పోలీసులు వెంటనే అతడి వైపు పరుగెత్తారు. అతడిని రక్షించి కుటుంబానికి అప్పజెప్పారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విటర్‌లో షేర్‌ చేసింది. మోటార్ మాన్ అద్భుతం చేశాడని, సకాలంలో అప్రమత్తమై వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగాడని రైల్వేశాఖ తన ట్వీట్ లో పేర్కొంది. కాగా,ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ Yogi Adityanath : రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ