Mumbai : మహిళ చేయి పట్టుకుని లాగినందుకు జైలుశిక్ష విధించిన కోర్టు

Man gets one-year jail for pulling ex-girlfriend’s hand: మాజీ  ప్రియురాలు చేయి పట్టుకుని లాగినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 2014లో మాజీ ప్రియురాలు చేయి పట్టుకుని తన దగ్గరకు లాగిన కేసు విషయంలో కోర్టు సదరు ఓవ్యక్తికి తాజాగా రూ.5,000 జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష విధించిన ఘటన ముంబై లో జరిగింది…! బహిరంగ ప్రదేశాల్లో మహిళకు ఇష్టం లేకుండా ఆమె చేయిపట్టుకోవడం, దగ్గరికి లాగడాన్ని ఆమె పరువుకు భంగం కలిగించిన నేరంగా పరిగణించిన ముంబై మెట్రోపాలిటన్ కోర్టు 28 ఏళ్ల యువకుడికి శిక్ష ఖరారు చేసింది. ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. ఐదు వేల జరిమానా విధించింది.

2014 సెప్టెంబర్ 20న నమోదైన ఈ కేసును విచారించి, తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రేయసి చేయిపట్టుకోవడం నేరంగా పరిగణించకూడదని నిందితుడు చేసిన వాదనను కొట్టి పారేశారు. అలాగే, కేసు నమోదైన తర్వాత నిందితుడి సత్ర్పవర్త చూసి అతడిని వదిలేయలేమని చెప్పారు. అయితే ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావడం..ఇప్పుడు సదరు (ప్రియుడికి) నిందితుడికి పెళ్లి అయ్యింది. రెండు సంవత్సరాల కూతురు కూడా ఉండంతో సదరు వ్యక్తి మానవతా దృక్పథంతో అతనికి కఠిన శిక్ష వేయడం లేదని..సాధారణ శిక్షతోనే వదిలివేస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు