Navneet Rana: పోలీసులపై నవనీత్ ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన కమిషనర్

హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జైల్లో పోలీసుల వైఖరి అనుచితంగా ఉందంటూ నవనీత్ కౌర్ ఆరోపించింది.

Navneet Rana: హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జైల్లో పోలీసుల వైఖరి అనుచితంగా ఉందంటూ నవనీత్ కౌర్ ఆరోపించింది. తమ అరెస్టు అక్రమమని, జైల్లో పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేతోపాటు, ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ లేఖ రాసింది. ఈ లేఖపై లోక్‌సభ సెక్రటరీ స్పందించారు. నవనీత్ చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలు తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లోక్‌సభ స్పీకర్ కోరారు.

Maharashtra : హ‌నుమాన్ చాలీసా చదువుకోండి కానీ దాదాగిరి చేస్తే సహించేది లేదు : ఉద్ధవ్ వార్నింగ్

దీంతో తమపై వచ్చిన ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. అవన్నీ అసత్య ఆరోపణలని విమర్శించారు. తాము నవనీత్, రవి ణా దంపతులను ఎలాంటి ఇబ్బందిపెట్టలేదని చెప్పారు. దీనికి రుజువుగా వాళ్లను జైల్లో ఎలా ట్రీట్ చేశారో చెబుతూ మంగళవారం ముంబై పోలీస్ కమిషనర్ ఒక వీడియో విడుదల చేశాడు. 12 సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో నవనీత్-రవి రాణాలు ఇద్దరూ కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నారు. వాళ్లిద్దరితో అనుచితంగా ప్రవర్తించారంటూ వచ్చిన విమర్శలకు సమాధానంగా ఉన్న ఆ వీడియోపై సంజయ్ పాండే ఒక కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఉన్న దృశ్యాలకంటే ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు