Maharashtra : హ‌నుమాన్ చాలీసా చదువుకోండి కానీ దాదాగిరి చేస్తే సహించేది లేదు : ఉద్ధవ్ వార్నింగ్

హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌నుకుంటే ప‌ఠించండీ..అంతేకాదు దాని మాటున రాజకీయాలు చేసి దాదాగిరీ చేస్తే ఏమాత్రం సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Maharashtra : హ‌నుమాన్ చాలీసా చదువుకోండి కానీ దాదాగిరి చేస్తే సహించేది లేదు : ఉద్ధవ్ వార్నింగ్
ad

Maharashtra CM Uddhav Thackeray ‘హ‌నుమాన్ చాలీసా చదువుకోండి కానీ దాదాగిరి చేస్తే సహించేది లేదు’ అంటూ మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. తీవ్రంగా హెచ్చరించారు. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌నుకుంటే ప‌ఠించండీ..అంతేకాదు దాని మాటున రాజకీయాలు చేసి దాదాగిరీ చేస్తే ఏమాత్రం సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ దాదాగిరి చేస్తే దాన్ని ఎలా అణ‌చాలో మామ‌కు బాగా తెలుసు అంటూ సోమవారం (ఏప్రిల్ 25,2022)తీవ్రంగా మండిపడ్డారు ఉద్ధవ్.

Also read : Anand Mahindra : భారత్‌లో‘ఒరిజనల్ టెస్లా వాహనం’ఇదే.. పెట్రోలుతో పనిలేదన్న ఆనంద్ మహీంద్రా..మస్క్ ఏమంటారో మరి..

కాగా మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పారాయణం విషయంలో జరుగుతున్న రాజకీయ దుమారంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ ఈ హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ..తాము ప‌క్కా హిందుత్వ‌వాదుల‌మ‌ని సీఎం ఉద్ధ‌వ్ పున‌రుద్ఘాటించారు. బీజేపీ గ‌న‌క దాదాగిరి చేస్తే… త‌మ భీమ రూపాన్ని, మ‌హా రౌద్ర రూపాన్ని చూడాల్సి వ‌స్తుంద‌ని సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. గ‌దా ధ‌రుడైన హ‌నుమంతుడిలాగా త‌మ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్‌గా ఉందని అని అన్నారు.

Also read : Twitter CEO Parag : మస్క్ మైండ్ గేమ్.. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌ను తొలగిస్తాడా? అతడికి ఎలాన్ ఎంత చెల్లించాలంటే?

తాము హిందుత్వ భూమిక‌ను విడిచిపెట్టామ‌ని బీజేపీ ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తోంద‌ని, మేం ఏం విడిచిపెట్టామో చెప్పాల‌ని సీఎం ఉద్ధవ్ ఈ సందర్భంగా బీజేకీకి స‌వాల్ విసిరారు. హిందుత్వ అంటే కేవ‌లం ధోవ‌తి క‌ట్టుకోవ‌డమేనా? అని ఎద్దేవా చేస్తూ ప్ర‌శ్నించారు. హిందుత్వ విష‌యంలో త‌మ‌ను విమ‌ర్శించే వారు.. ఇంత‌కు వారు హిందుత్వ‌కు ఏం చేశారో ఒకసారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని ఉద్ధ‌వ్ ఎద్దేవా చేశారు.