Anand Mahindra : భారత్‌లో‘ఒరిజనల్ టెస్లా వాహనం’ఇదే.. పెట్రోలుతో పనిలేదన్న ఆనంద్ మహీంద్రా..మస్క్ ఏమంటారో మరి..

భారత్‌లో ఒరిజనల్ టెస్లా వాహనం’ ఇదే .. పెట్రోలుతో పనిలేదంటూ ఆనంద్ మహీంద్రా టెస్లా కార్ల సీఈవో ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు.

Anand Mahindra : భారత్‌లో‘ఒరిజనల్ టెస్లా వాహనం’ఇదే.. పెట్రోలుతో పనిలేదన్న ఆనంద్ మహీంద్రా..మస్క్ ఏమంటారో మరి..

Anand Mahindra Viral Tweet (1)

Updated On : April 26, 2022 / 12:27 PM IST

anand mahindra viral tweet : ట్విట్టర్ ను కూడా కొనేసిన ఎలన్ మస్క్ కు సెటైర్ వేశారో లేక సరదాగా ట్వీట్ చేసారో తెలీదు గానీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్ర ‘చూడు మస్క్..’అంటూ ఎడ్ల బండిపై రైతులు హాయిగా పడుకుని వెళుతున్న ఎడ్లు మాత్రం ఎవరు తోలకుండానే చక్కగా ముందుకు సాగే ఫోటోను ఒకటి షేర్ చేస్తూ..భారత్ లో ఇదే అసలైన టెస్లా వాహనం అంటూ పేర్కొన్నారు.

Also read : Anand Mahindra: మణిపూర్లో రోడ్డు ట్రాఫిక్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ ఫోటో..కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్విట్టర్ లో పలు పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఆనంద్ మహేంద్రా. తాజాగా అలాంటి పోస్టే ఒకటి షేర్ చేస్తూ టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా డ్రైవర్‌తో పనిలేకుండానే దూసుకుపోయే కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కార్లకు బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అవసరం చాలా ఉంది.

Also read : Karnataka Farmer : రైతు ఇంటికి వచ్చిన బొలెరో వాహనం.. క్షమాపణలు చెప్పిన మహీంద్రా ప్రతినిధులు

కానీ అటువంటివేమీ అవసరంలేని ‘ఒరిజనల్ టెస్లా వాహనం’ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ఓ ఎద్దులబండి ఫొటోను పోస్టు చేశారు. ఆ బండిపై ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు రైతుల మాదిరిగానే ఉన్నారు.బండిని నడిపే రైతు, వెనకనున్న ఇద్దరు కూడా హాయిగా కునుకు తీస్తుండగా, ఎద్దులు మాత్రం గమ్యం దిశగా సాగిపోతున్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దీని ఫీచర్లను కూడా వివరించారు.

Also read : Anand Mahindra: బుడతడు చేపలు పట్టే విధానంలో “విజయాన్ని చూసిన” ఆనంద్ మహీంద్రా: వైరల్ వీడియో

‘‘ఒరిజినల్ టెస్లా వెహికిల్ ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు. ఇంధనం కొనాల్సిన పనిలేదు. పొల్యూషన్ అంతకంటే లేదు. ఇది పూర్తిగా స్వయం చాలక వాహనం’’ అని కామెంట్ తగిలించారు. దీనికి కావాల్సిందల్లా ఇల్లు, పనిచేసే ప్రదేశాన్ని అలవాటు చేసుకోవడమే. ఆ తర్వాత ఎంచక్కా బండెక్కి ఓ కునుకు తీసినా గమ్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ఆనంద్ మహేంద్రా. అంతేకాదు, ఈ ట్వీట్‌పై రియాక్షన్ కోరుతూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.