Mumbai : తాగి పారేసిన టెట్రా పాక్ డబ్బాలతో స్కూలు డెస్క్‌లు, బెంచీలు.. నిరుపేద విద్యార్ధులకు ముంబయివాసుల సాయం

తాగి పారేసిన పానీయాల డబ్బాలు రీసైకిల్ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయవచ్చు. ముంబయివాసులు 'Cartons2Classooms' అనే చక్కని కార్యక్రమం ద్వారా వీటిని సేకరించి నిరుపేద విద్యార్ధులు చదువుకుంటున్న స్కూళ్లకు బెంచీలు, డెస్క్‌లు తయారు చేయించి ఇచ్చారు.

Mumbai

Mumbai : టెట్రా పాక్ డబ్బాలు కాగితంతో తయారు చేస్తారని.. వాటిని రీసైకిల్ చేస్తే మళ్లీ ఉపయోగించవచ్చని చాలామందికి తెలియకపోవచ్చు. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ముంబయి వాసులు నిరుపేద పిల్లల కోసం డెస్క్‌లు, బెంచీలు తయారు చేయించి ఇచ్చారు. ‘కార్టన్ 2 క్లాస్ రూం’ అనే డ్రైవ్ నిర్వహించడం ద్వారా ఈ సాయం అందించారు.

Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

వేసవికాలంలో చల్లటి పానీయాలు తాగుతాం. జ్యూస్ లు, మిల్క్ షేక్స్, లస్సీ, ఇలా.. ఆ తరువాత టెట్రా పాక్ కార్టన్‌లను బిన్‌లోకి విసిరేస్తాం. అయితే అవి ఎంత విలువైనవో తెలిస్తే మీరు ఆ పని చేయరు. వాటితో ఏం చేయవచ్చునో ముంబయివాసులు చేసి చూపించారు. Tetra Pak, Nesle a+, Reliance Retail మరియు RUR Greenlife లు సంయుక్తంగా ‘Cartons2Classroom’ అనే కార్యక్రమం చేపట్టాయి. ఈకార్యక్రమం ద్వారా సేకరించిన పానీయాల డబ్బాలను రీసైక్లింగ్ చేసి నిరుపేద పిల్లల కోసం మూడు స్కూళ్లకు డెస్క్‌లు, బెంచీలు తయారు చేసి ఇచ్చారు. పూణెలోని మహిమ్ పోలీస్ కాలనీ స్కూల్, నెరుల్‌లోని విద్యార్ధి గృహ, మరియు మహాత్మా పూలే విద్యాలయాలకు కలిసి 100 వరకూ రీసైకిల్ చేసిన డెస్క్‌లు విరాళంగా ఇచ్చారు.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

నిజానికి ‘Cartons2Classooms’ కార్యక్రమం ఏప్రిల్ 2022లో మొదలైంది. 2023 ‘ఎర్త్ డే’ రోజున మొదటి దశ పూర్తి చేసుకుంది. రీసైక్లింగ్ ప్రాముఖ్యతను అందరిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘గో గ్రీన్ విత్ టెట్రా పాక్’ పేరుతో ఈ అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. rurgreenlife and gogreenwithtetrapak అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులకు అందరూ అభినందనలు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు