Bank Cheating: ప్రైవేట్ బ్యాంకు పేరుతో వందలాది మందికి కుచ్చుటోపీ

ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు.

Bank Cheating: తమ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే.. ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ వందలాది మంది పేదల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది ఒక ప్రైవేటు నిధుల సేకరణ సంస్థ. ప్రైవేటు బ్యాంకు అంటూ మభ్యపెట్టి ఖాతాదారులకు అకౌంట్లు ఇచ్చి వారి నుంచి కోట్ల రూపాయల నగదు దండుకుని నిర్వాహకులు పరారైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజ్నోర్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. ముస్లింల కోసం పనిచేస్తున్న “అల్ ఫైజాన్ ముస్లిం ఫండ్ లిమిటెడ్” అనే ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుడు మొహమ్మద్ ఫైజీ.. బిజ్నోర్ జిల్లాలోని నగీనా ప్రాంతంలో ఈ అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించేవాడు. సంస్థ తరుపున ఎక్జిక్యూటివ్ లను నియమించి పేద ముస్లింల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అధిక వడ్డీ ఇస్తామంటూ ఐదేళ్ల కాలంలో మొహమ్మద్ ఫైజీ కోట్లాది రూపాయలు వసూలు చేశాడు.

Also read: Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

ముస్లిం షరియా చట్టాల ప్రకారం డబ్బుపై వడ్డీ ఇవ్వడం, వసూలు చేయడం, నేరంగా పరిగణిస్తారు. చట్టాలను నమ్మిన నగీనా ప్రాంతంలోని కొందరు ముస్లింలు, తమ వద్దనున్న నగదును బ్యాంకులలో డిపాజిట్ చేసేవారు కాదు. దీన్ని అవకాశంగా భావించిన మొహమ్మద్ ఫైజీ.. బ్యాంకుల కంటే తమ “అల్ ఫైజాన్ ముస్లిం ఫండ్ లిమిటెడ్” సంస్థ ఎంతో సురక్షితమని నమ్మబలికాడు. ఫైజిని నమ్మిన వందలాది మంది పేద ముస్లింలు కోట్ల రూపాయలు సంస్థలో డిపాజిట్ చేశారు. ఫైజి ఈ ఐదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు మూటగట్టి ఉంటాడని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించుకున్నారు.

Also Read: Formula E in Hyderabad: హైదరాబాద్ కు “ఫార్ములా ఈ” కార్ రేసింగ్

ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 170 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్లు బిజ్నోర్ జిల్లా పోలీసులు తెలిపారు. బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని..అందరి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మొత్తం ఎంత మేర నగదు మోసం జరిగిందో గుర్తిస్తామని నగీనా స్టేషన్‌ హౌస్‌ అధికారి కృష్ణ మురారి పేర్కొన్నారు. సంస్థ కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మొహమ్మద్ ఫైజీని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు SHO కృష్ణ మురారి పేర్కొన్నారు.

Also read: Tiger Death: మధ్యప్రదేశ్ వన్యప్రాణి ముఖచిత్రంగా నిలిచిన “కాలర్ వాలి పులి” మృతి

ట్రెండింగ్ వార్తలు