Tiger Death: మధ్యప్రదేశ్ వన్యప్రాణి ముఖచిత్రంగా నిలిచిన “కాలర్ వాలి పులి” మృతి

పెద్దపులులు నిలయమైన మధ్యప్రదేశ్ లో.. ఆ రాష్ట్ర వన్యప్రాణి/అటవీశాఖ ముఖచిత్రంగా నిలిచిన "కాలర్ వాలి పులి" మృతి చెందింది.

Tiger Death: మధ్యప్రదేశ్ వన్యప్రాణి ముఖచిత్రంగా నిలిచిన “కాలర్ వాలి పులి” మృతి

Tiger

Tiger Death: పెద్దపులులు నిలయమైన మధ్యప్రదేశ్ లో.. ఆ రాష్ట్ర వన్యప్రాణి/అటవీశాఖ ముఖచిత్రంగా నిలిచిన “కాలర్ వాలి పులి” మృతి చెందింది. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో ఉండే ఈ T15 బ్రీడ్ టైగర్ తన జీవిత కాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చి “సూపర్ మామ్” బిరుదును సంపాదించింది. దాదాపు 20 ఏళ్ల సరాసరి జీవిత కాలం కలిగి ఉండే ఈ పులుల్లో..”కాలర్ వాలి పులి” 16 ఏళ్ళు జీవించింది. గత కొంత కాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న ఈ పులిలో అవయవాలు పనిచేయడం ఆగిపోవడంతో మృతి చెందినట్లు.. పెంచ్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, అలోక్ మిశ్రా ఆదివారం తెలిపారు.

Also read: UAE passengers: యూఏఈ నుంచి వచ్చే వారికి RT-PCR పరీక్షలు లేవు

అటవీశాఖ సిబ్బంది “మాతరం”గా పిలిచే ఈ పులి 2008-2018 మధ్య కాలంలో 29 పులి పిల్లలకు జన్మనిచ్చి, భారత్ లో పులుల గణనలకు ఎంతో తోడ్పడింది. 2008లో “మాతరం” పులికి పెంచ్ ఫారెస్ట్ అధికారులు రేడియో కాలర్ బిగించారు. వన్యప్రాణులు అడవిలో సంచరించే సమయంలో వాటి సమాచారాన్ని సేకరించేందుకు, వాటి నుంచి మనుషులను అప్రమత్తం చేసేందుకు ఈ రేడియో కాలర్ ఉపయోగపడుతుంది. కొంతకాలానికి ఆ రేడియో కాలర్ ఆగిపోగా.. తిరిగి 2010లో మళ్లీ బిగించారు. దీంతో ఈ పులిని అటవీశాఖ సిబ్బంది “కాలర్ వాలి”(కాలర్ ధరించిన) పులిగా పిలిచేవారు.

Also read: Kalyan Krishna : ‘బంగార్రాజు’ డైరెక్టర్‌కి తమిళ్ నుంచి భారీ ఆఫర్

“మాతరం” సంతతి దేశంలోని వివిధ టైగర్ రిజర్వులో ఉన్నాయి. ఒకేసారి 5 పిల్లలకు జన్మనివ్వగల ఈ జాతి పులుల్లో మాతరం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పదేళ్ల పాటు ఈ పులిని కాచుకు కూర్చున్న పెంచ్ అటవీశాఖ సిబ్బంది ఒకరు గుర్తుచేసుకున్నారు. మాతరం పులి మృతి పట్ల.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సైతం నివాళులర్పించారు. “పులుల రాష్ట్రంగా మధ్యప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన ‘సూపర్ టైగ్రెస్ మామ్’ మధ్యప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. 29 పిల్లలకు జన్మనిచ్చి ‘మధ్యప్రదేశ్ అడవుల రాణి’గా నిలిచిన ‘మాతరం’ సంతతి గాండ్రిపులు పెంచ్ అడవుల్లో ప్రతిధ్వనిస్తాయని” సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ట్వీట్ చేశారు.

Also read: Taliban: మహిళా నిరసనకారులపై తాలిబాన్ల పెప్పర్ స్ప్రే