అమిత్ షా కు వ్యతిరేకంగా…35కిలోమీటర్ల “బ్లాక్ వాల్”

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ ఇంటి ముందు ముగ్గుల రూపంలో ఇలా వినూత్నంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే సీఏఏకి వ్యతిరేక నిరసనల్లో భాగంగా ఓ వినూత్న పద్దతిలో నిరసనకు రెడీ అయ్యారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్. జనవరి15న కేరళలోని కోజికోడ్ లో అమిత్ షా సీఏఏ అనుకూల ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే ఈ సమయంలో కోజికోడ్ లో 35కిలోమీటర్ల పొడవైన బ్లాక్ వాల్ కార్యక్రమానికి ముస్లిం యూత్ లీగ్(MYL) రెడీ అయింది.

అమిత్ షాకు వ్యతిరేకంగా బ్లాక్ వాల్ ఆందోళనలో భాగంగా దాదాపు 1లక్షమంది ప్రజలు నల్లదుస్తులు ధరించి వెస్ట్ హిల్ లోని హెలిప్యాడ్ దగ్గర నుంచి కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు లైన్ గా నిలబడతారని ముస్లిం యూత్ లీగ్ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అంతేకాకుండా బ్లాక్ వాల్ ఆందోళనలో భాగంగా 1893 నాటి స్వామి వివేకానంద ఫైమస్ చికాగో స్పీచ్ ని ప్రింట్ చేసి వాటిని జనవరి12న పబ్లిక్ ప్లేస్ లలో డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించింది ముస్లిం యూత్ లీగ్. జనవరి12న స్వామి వివేకానంద జయంతి అన్న విషయం తెలిసిందే.

పోలీసులు అమిత్ షా కంట్రోల్ లో ఉన్నారని,సీఏఏను వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై ఆర్ఎస్ఎస్ కార్య నిర్వాహకులు హింసకు పాల్పడుతున్నారని కోజికోడ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో MYL జనరల్ సెక్రటరీ పీకే ఫిరోస్ విమర్శించారు. గుజరాత్‌లో 2002 లో జరిగిL మాదిరిగానే హింసను ప్రారంభించాలని హోంమంత్రి అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. సాయుధ ముఠాలు ఆదివారం రాత్రి జెఎన్‌యు విద్యార్థులపై హింసకు పాల్పడటం దీనికి ఓ నిదర్శనమని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు