లాక్ డౌన్ ఎఫెక్ట్ : అందరూ ఉన్నా అనాధ అయ్యాడు.. హిందూ శవానికి అంత్యక్రియలు చేసిన ముస్లింలు

  • Publish Date - March 30, 2020 / 01:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఈ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయిన గాని చూడటానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. దీంతో చనిపోయినవారిని పొరుగు వారే దహనం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన రవిశంకర్ అనే వ్యక్తి ఆదివారం  (మార్చి 29, 2020)న క్యాన్సర్ తో బాధపడుతూ మరణించాడు. కానీ లాక్ డౌన్ కారణంగా అతన్ని చూసేందుకు బంధువులతో సహా ఎవరు రాలేకపోయారు. దీంతో పొరుగువారు అతని శవాన్ని ఊరేగించి అంత్యక్రియలు జరిపారు. వారంతా ముస్లింలు కావడం గమనార్హం. 

ఆ శవాన్ని ఊరేగిస్తూ.. ‘రామ్  నామ్ సత్య హై’ అని నినాదాలు కూడా చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన రామ్ కొడుకు మాట్లాడుతూ.. నాకు ఎదురైన కష్టం మరెవరికి రాకూడదు. నన్ను ఈ సమయంలో ముస్లింలు ఆదుకున్నారు, నాకు అండగా నిలిచారని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు