Muslims Using Most Contraceptives Says Mp Owais
muslims using most contraceptives says mp owais : జనాభా అసమానతను అనుమతించేది లేదని యూపీ సీఎం ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైస్ కౌంటర్ ఇచ్చారు. సీఎం యోగీ యూపీ రాజధాని లక్నోలోని ‘జనాభా నియంత్రణ పక్షం’ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జనాభా నియంత్రణ పక్షం’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని..అదే సమయంలోజనాభా అసమతుల్యతను అనుమతించకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ యోగీకి కౌంటర్ గా మాట్లాడుతూ..‘ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు పాటిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుత..‘ముస్లింలు భారత మూలనివాసులు కాదా? అని ప్రశ్నించారు. నిజంగా మనం వాస్తవాలను పరిశీలిస్తే.. గిరిజనులు, డ్రవిడులు మాత్రమే మూలనివాసులు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి చట్టం అవసరం లేకుండానే ఆశించిన సంతాన రేటును 2026 నుంచి 2030 మధ్యలో అందుకోనుంది’ అని అసదుద్దీన్ ఒవైసీ వివరించారు.
‘దేశంలో జనాభా నియంత్రణకు చట్టం అవసరం లేదు’ అని వారి సొంత (బీజేపీ మంత్రి) ఆరోగ్య మంత్రినే స్వయంగా ఈ విషయాలు చెప్పాడని అసదుద్దీన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ముస్లింలు ఎక్కువగా కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారని వెల్లడించారు. 2016లో మొత్తం సంతాన రేటు 2.6గా ఉన్నదని, ప్రస్తుతం 2.3గా ఉన్నదని తెలిపారు. దేశ డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్ని దేశాల్లోకెల్లా బాగున్నదని అన్నారు.
సోమవారం (11,2022)యునైటెడ్ నేషన్స్ జనాభాకు సంబంధించిన రిపోర్టు విడుదల చేసింది. 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని ఆ రిపోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ..జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలని..అదే సమయంలో జనాభా అసమతుల జనాభాను ఆహ్వానించరాదని తెలిపారు.
కాగా యోగీ మాట్లాడుతూ..”జనాభా పెరుగుదల వేగం లేదా కొంత కమ్యూనిటీ శాతం ఎక్కువగా ఉండటం జరగకూడదు..అవగాహన లేదా అమలు ద్వారా మేము ‘మూల్నివాసి’ (స్థానికులు) జనాభాను స్థిరీకరించాము అని అన్నారు.జనాభా స్థిరీకరణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక స్థాయిలో, జనాభా అనేది సమాజం సాధించిన విజయం..అయితే సమాజం ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉన్నప్పుడే ఇది ఒక విజయంగా మిగిలిపోతుందని అన్నారు.