Nagaland Minister Temjen Imna Viral Tweet
Nagaland Minister Temjen Imna Viral Tweet : నాకళ్ళు చిన్నవే కానీ మైలు దూరంలో ఉండే కెమెరాను కూడా చూడగలను అంటూ నాగాలాండ్ మంత్రి చేసిన ఓ సరదా ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. తనను ఫొటో తీయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి నాగాలాండ్ ఉన్న విద్యా శాఖ మంత్రి తెంజెన్ ఇన్మా అలోంగ్ ఈ ట్వీట్ చేశారు. తాను జనం మధ్యలో ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ మంత్రి ఇలా అన్నారు.
‘‘నా కళ్లు చిన్నవిగానే ఉండవచ్చు.. కానీ మైలు దూరంలో ఉన్న కెమెరాను కూడా పట్టేస్తా. కెమెరా కోసం ఎప్పుడూ రెడీగా ఫోజు పెట్టి ఉంటా. అంతేకాదు ఇది చదువుతున్నప్పుడు మీరు నవ్వుతుండటం కూడా నేను చూడగలను. గుడ్ మార్నింగ్..” అని తన ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టారు. మంత్రి చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. కాగా..మంత్రి తెంజెన్ ఇన్మా అలోంగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. సరదా వ్యాఖ్యలు, పోస్టులు పెడుతుంటారు. ఈక్రమంలో ఆయన చేసిన ట్వీట్..పెట్టిన ఫోటో వైరల్ అవుతున్నాయి. మంత్రి పెట్టిన ఈ పోస్టుకు 79 వేలకుపైగా లైకులు రాగా.. వేలకొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి. నెటిజన్లు మంత్రి హాస్య చతురతను ప్రశంసిస్తున్నారు. ‘మంచి హాస్య చతురత, బంగారం లాంటి మనసు ఉన్న నేత’ అని చాలా మంది తెగ పొగిడేస్తున్నారు.
Munugode By Poll : మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? : మల్లారెడ్డి
భారతదేశంలో ప్రజలు ఆహార్యాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటారు. దక్షిణ భారతంలో ప్రజలు ఒకలా ఉంటే ఉత్తరభారతంలో ప్రజలు ఇంకోలా ఉంటారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మరోలా ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల వారి శరీరతత్వం వేరుగా ఉంటుంది. వారి కళ్లు కాస్త చిన్నవిగా ఉంటాయి. జపాన్ ప్రజల కళ్లులాగా ఉంటాయి. ఈక్రమంలో నాగాలాండ్ మంత్రి తన సరదా పోస్టులో పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అప్పుడప్పుడూ తనను ఫొటో తీయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి పోస్ట్ చేశారు.
మంత్రి గతంలో కూడా కొందరు అభిమానులు ఆయనతో దిగిన గ్రూప్ ఫొటోను ఇన్మా అలోంగ్ షేర్ చేశారు. ‘‘మనం ఇంకా పెళ్లికాకుండా ఉండి, చాలా క్యూట్ గా ఉంటే.. ఇలాగే అంతా మన వెంట పడతారు” అని సరదా కామెంట్ పెట్టారు. ఆ పోస్టు కూడా అప్పట్లో తెగ వైరల్ అయిపోయింది.
My eyes may be small, but I can see the camera from a mile.
Always pose ready. ?
Also I can see you smile as you reading it! ?
Good Morning pic.twitter.com/7ntWw5UMVx
— Temjen Imna Along (@AlongImna) October 9, 2022
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.