Delhi Mayor Shelly Oberoi
Delhi Mayor Shelly Oberoi : ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఫేస్‌బుక్ పేజీని రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీ మేయర్ తెలిపారు.
ALSO READ : New Covid-19 Subvariant JN.1 : చైనాలో మళ్లీ కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1
‘‘కొన్ని రోజులుగా నేను నా ఫేస్‌బుక్ పేజీని యాక్సెస్ చేయలేకపోతున్నాను. అది హ్యాక్ చేశారు. వీలైనంత త్వరగా దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని మేయర్ ఒబెరాయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డారని హిందూ రావ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు మేయర్ తెలిపారు.
ALSO READ : Parliament Election : పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల సమాయత్తం
‘‘ఈ రోజు తెల్లవారుజామున హిందూరావు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశాను, ఆర్థిక, పరిపాలనా అవకతవకలు, పరిశుభ్రత లోపానికి సంబంధించి మెడికల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించాను’’ అని మేయర్ చెప్పారు.