Parliament Election : పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల సమాయత్తం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గడవు కంటే నెలరోజుల ముందే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.....

Parliament Election : పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల సమాయత్తం

Parliament Elections

Updated On : December 16, 2023 / 7:03 AM IST

Parliament Election : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గడవు కంటే నెలరోజుల ముందే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయంతో జోరు మీదున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి నెల 20వతేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మార్చి 7 నుంచి పది దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

నెలరోజుల ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు?

అలా త్వరగా ఎన్నికలు జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాల్లో మార్చి 10-15 తేదీల మధ్య పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 17వ లోక్ సభ గడువు 2024 జూన్ 16వతేదీతో ముగియనుంది. దీంతో మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. గత 2019 వసంవత్సరంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వతేదీన విడుదలైంది. గతంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వతేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి.

ఏపీలో వైసీపీ, టీడీపీలు సమాయత్తం 

సాధారణ షెడ్యూల్ ప్రకారం 18వ లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగాలి. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో కమలనాథులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఉత్సాహపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటుతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నందున వైసీపీ, టీడీపీలు ఎన్నికలకు సమాయత్తం దిశగా పావులు కదుపుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలను వైసీపీ ఇటీవల మార్చింది.

పార్లమెంటు ఎన్నికలపై సీఎం రేవంత్ దృష్టి

చంద్రబాబు పార్టీ నేతలతో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. మరో వైపు తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ మినహాయించి మిగతా 16 లోక్ సభ స్థానాలపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శనివారం నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అయింది.

ALSO READ : World’s Largest Office Building : గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన సూరత్ వజ్రాల భవనం…రేపు మోదీ ప్రారంభోత్సవం

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా 40రోజులపాటు 163 ప్రచార వాహనాలతో భారత్ సంకల్ప్ యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్థుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గం నుంచి ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందించారు.

ALSO READ : BJP MLA : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కూడా లోక్ సభ ఎన్నికలకు కసరత్తు ఆరంభించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు కసరత్తు ఆరంభించారని సమాచారం. మొత్తంమీద పార్లమెంటు ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.