BJP MLA : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014వ సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌కు శుక్రవారం 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.....

BJP MLA Ramdular Gond
BJP MLA : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014వ సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌కు శుక్రవారం 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రామ్ దులర్ పై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. అత్యాచార బాధితురాలికి 10 లక్షల రూపాయల జరిమానా కూడా జడ్జి విధించారు.
సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సన్ ఉల్లా ఖాన్ ఈ తీర్పును వెలువరించారు. ఈ సంఘటన 2014వ సంవత్సరంలో జరిగింది. ఎమ్మెల్యే గోండుపై ఐపీసీ సెక్షన్లు 376, 506, పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన దుద్ధి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను డిసెంబర్ 12వతేదీన కోర్టు దోషిగా నిర్ధారించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యప్రకాష్ త్రిపాఠి తెలిపారు.
ALSO READ : Andhra Pradesh Politics : వైసీపీలో మార్పులు, టీడీపీలో చేరికలు.. ఏపీలో వేడెక్కిన రాజకీయం
నేరం జరిగినప్పుడు రామ్దులర్ గోండ్ ఎమ్మెల్యే కాదని, అతని భార్య గ్రామ ప్రధాన్ అని త్రిపాఠి తెలిపారు. ఈ కేసులో విచారణ పోక్సో కోర్టులో ప్రారంభమైంది. అయితే నిందితుడైన గోండ్ శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడిన ఉదంతం యూపీలో సంచలనం రేపింది.