Yathindra Siddaramaiah : మా నాన్నే మరోసారి సీఎం కావాలి.. ఎందుకంటే : సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర

కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.

Siddaramaiah's son Yathindra Siddaramaiah

Siddaramaiah : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న క్రమంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ యత్నిస్తోంది. దీంతో తన తండ్రే సీఎం కావాలి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలని అన్నారు యతీంద్ర.గత బీజేపీ హయాంలో జరిగిన అవినీతిని సరిచేసే సత్తా తన తండ్రికి మాత్రమే ఉందని యతీంద్ర అన్నారు. ఓ కొడుకుగా, కన్నడ పౌరుడిగా నా తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని.. మంచి పాలన అందించిన నేతగా తన తండ్రికి మంచిపేరుందని అన్నారు.

అలాగే మరోసారి సీఎం అయితే మరింత మంచి పాలన అందించటమేకాకుండా బీజేపీ పాలనలో జరిగిన అవినీతిని సరిచేస్తారని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూసినా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే అవ్వాలని అన్నారు యతీంద్ర. ప్రయోజనాలను కాపాడే విషయంలో తన తండ్రికి ప్రత్యామ్నాయంగా మరొకరు లేరన్నారు మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య.

కర్ణాటకలో రాహుల్ గాంధీ వినూత్న రీతిలో ప్రచారం.. అలాగే ప్రియాంకాగాంధీ మ్యాజిక్ బాగా పనిచేసింది. దీంతో కాంగ్రెస్ మంచి సానుకూల ఫలితాలు రాబడుతోంది.అలాగే కన్నడ కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం సిద్ధరామయ్య కృషితో పాటు మరో నేత శివకుమార్ కష్టం కూడా ఫలితం దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Karnataka Polls: ఒటమి దిశగా సగం మంది మంత్రులు.. లెక్కింపులో వెనుకబడిన అగ్రనేతలు

ఆధిక్యంలో దూసుకుపోతున్నా కాంగ్రెస్ మందస్తు జాగ్రత్తగా తమ అభ్యర్థుల్ని ఈగల్టన్ రిసార్ట్స్ కు తరలించింది. బీజేపీ ఎక్కడ తమ అభ్యర్ధులకు ప్రలోభపెట్టి లాగేసుకుంటుందని ముందస్తుగా కాంగ్రెస్ అప్రమత్తమైంది. పూర్తిగా ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్తగా తమ అభ్యర్థులను భద్రపరుచుకోవటాని ఏర్పాట్లు చేసింది. రేపు సీఎల్పీ భేటీతో భవిష్యత్ కార్యచరణ దిశగా యోచించనుంది. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజారిటీ వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ కన్నడనాటే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా హస్తం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 116 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జెడీఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. కనీసం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. దీంతో ఈ స్థానాల్లో ఫలితాలు ఎప్పుడైనా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Karnataka Election Results 2023 : జేడీఎస్ కంచుకోట మైసూర్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం