lidder Daughter Aashna : ‘మా నాన్న హీరో’..హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లిద్ద‌ర్ కుమార్తె ఆస్నా..

‘మా నాన్న హీరో’ నాకు మంచి ఫ్రెండ్..మాకు మార్గదర్శకుడు అంటూ పొంగివస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటు చెప్పింది బిపిన్ రావత్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లిద్ద‌ర్ కుమార్తె ఆస్నా

Lidder Daughter Aashna (1)

Gen Bipin Rawat..lidder daughter Aashna : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 13మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయినవారిలో బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్‌ కూడా ఉన్నారు. ఆయన మరణంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఎంతైనా మిలటీరి కుటుంబం కదా..దు:ఖాన్ని దిగమింగుకుని లిద్దర్ మరణంపై గొప్పగా పెద్ద మనస్సుతో స్పందించింది లిద్దర్ కుటుంబం. వయస్సులోనే చిన్నదే అయినా తండ్రి కోల్పోయిన దు:ఖాన్ని అదుముకుని లిద్దర్ కుమార్తె ఆస్నా చాలా గొప్పగా మాట్లాడింది. ‘ మా నాన్న హరో..నాకు మంచి స్నేహితుడు..అంతేకాదు గొప్ప మార్గదర్శకుడు కూడా’’అంటూ వ్యాఖ్యానించింది.

Read more : Brigadier Lakhwinder Singh Lidder : భర్త శ‌వ‌పేటిక‌ను ముద్దాడిన బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్ భార్య‌..

తమిళనాడులో జరిగిన హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్‌ కుమార్తె ఆస్నా లిద్ద‌ర్.. తండ్రిని కోల్పోయి..గుండెల్లోంచి త‌న్నుకొస్తున్న దుఃఖాన్ని దిగ‌మింగుకుంటూ త‌న తండ్రితో త‌నకుగ‌ల అనుబంధాన్ని గుర్తు చేసుకుందా అమ్మాయి. ‘‘నా తండ్రి హీరో..నాకు మంచి స్నేహితుడ‌ే కాదు నాకు గొప్ప మార్గ‌ద‌ర్శ‌కుడు… ఇప్పుడు ఆయ‌న మా నుంచి దూరం కావ‌డం దైవ సంక‌ల్పం కావ‌చ్చు..చనిపోయిన ఆయన తిరిగి రారు..కానీ ఆయన మాకు ఇచ్చిన ధైర్యం..ఎటువంటి సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో నేర్పారు..ఆయన చూపింన మార్గంలోనే మేం నడుస్తాం..మాకు మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా’’ అని ఆస్నా లిద్ద‌ర్ వ్యాఖ్యానించింది.

Readmore : Bipin Rawat :‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి..

నాకు ఇప్పుడు 17 సంవ‌త్స‌రాలు..మా నాన్నతో నాకు 17 ఏళ్ల గొప్ప అనుబంధం ఉంది..నా తండ్రి మాకు మిగిల్చి తీపి జ్ఞాపకాల‌తో ముందుకు సాగుతాం అంటే తెలిపింది. ఈ దు:ఖ సమయంలో లిద్ద‌ర్ భార్య గీతికా లిద్ద‌ర్‌ పొంగుకొస్తున్న దు:ఖాన్ని అదుముకుంటే త‌న భ‌ర్తతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఆయన మ‌ర‌ణం మాకు ఎన్నిటికీ తీర‌ని లోట‌ు..నేను ఓ వీర సైనికుడి భార్య‌ని..అది నాకు గర్వకారణం..అని తెలిపారు. ఆయన మాకు ఇచ్చిన ధైర్యాన్ని మనోస్థైర్యంగా చేసుకుని ఆయనకు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికామ‌ని తెలిపారు. ఈ మాట‌లు చెబుతూ ఆమె ఉబికివ‌స్తున్న‌ దుఃఖాన్ని పంటిబిగువున అణిచిపెట్ట‌డం చూసేవారికి కంటతడి పెట్టించింది.

Read more : Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం