Bipin Rawat :‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి..

‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి చెందటంతో ఆయన కుటుంబం కుమిలిపోతోంది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏపీ సాయితేజ.

Bipin Rawat :‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి..

Army Chief Bipin Rawat Staff ..sai Teja Dead

Army Chief Bipin Rawat Staff ..Sai Teja dead : ఎక్కడో వందల మైళ్ల దూరంలో భారత ఆర్మీలో సేవలు అందిస్తున్న భర్త ఫోన్ చేసేసరికి జవాన్ సాయితేజ భార్య సంబరపడిపోయింది. మన బంగారు తల్లి (కూతురు దర్శిని)ని చూడాలని ఉంది శ్యామలా అంటూ భార్యకు వీడియో కాల్ చేసిన గంటకే భర్త చనిపోయాడని తెలిస్తే ఆ భార్య మానసకి వేదన ఎలా ఉంటుందో ఊహించలేదు. అటువంటి తీవ్ర విషాదంలో గుండెలు పగిలేలా కుమిలిపోతోంది జవాన్ సాయితేజ భార్య శ్యామల..

భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన విషాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది దుర్మణం పాలవగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం తరువాత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తీవ్ర గాయలతో ప్రాణాలతోనే ఉన్నారు. ఆతరువాత మరణించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యే సమయంలో రావత్ చాపర్ నుంచి దూకేసినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాలతోనే ఉన్నా..ఆ తరువాత ఆయన్ని హుటాహుటినా హాస్పిటల్ కు ఆసుపత్రికి తరలించే సమయంలో రావత్ ప్రాణాలు కోల్పోయారు.

Read more : Bipin Rawat : ద‌ట్ట‌మైన పొగ‌మంచులో రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వైరల్ వీడియో
ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరుగా ఉన్న సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారే. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ మరణంతో వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. 29 ఏళ్ల బి.సాయితేజ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేరిన తర్వాత సాయితేజ ఢిల్లీలోనే ఉంటున్నారు. సంవత్సరం క్రితం సాయితే తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు.

ప్రమాదం జరగటానికి ఓ గంట ముందు అంటే గురువారం (డిసెంబర్ 8,2021) ఉదయం 8.15 గంటలకు సాయితేజ భార్య శ్యామలకు వీడియో కాల్ చేశారు. నా బంగారు తల్లిని కూడాలని ఉంది అంటూ తన కూతురు దర్శినిని చూడాలని ఆకాంక్షను తన భార్యతో చెప్పారు. అలా భార్య శ్యామలతో సాయితేజ చాలాసేపు మాట్లాడారు. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు అందరితోను మాట్లాడాడు సాయితేజ. ఆ తర్వాత కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసి మదనపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Read more : Varun Singh : అంతటి ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోనూ.. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు