Nagaland Assembly Elections: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. గడువు ముగుస్తున్నా వచ్చింది ఆరు నామినేషన్లే

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.

Nagaland Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలంటే రాజకీయ నాయకుల్లో బోలెడంత హడావుడి ఉంటుంది. గెలుపు, ఓటములు తర్వాత.. ముందుగా నామినేషన్లు వేసే నేతలు చాలా మందే ఉంటారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా బోలెడంత మంది నామినేషన్లు వేస్తుంటారు.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

అయితే, విచిత్రంగా నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇలాంటి హడావుడి కనిపించడం లేదు. అక్కడ ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే. ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉన్నప్పటికీ నామినేషన్లు అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఇది నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలపై అక్కడి నేతలకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. దాఖలైన ఆరు నామినేషన్లలో రెండు నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) నుంచి, ఒకటి బీజేపీ నుంచి, రెండు ఇండిపెండెంట్లుకాగా, ఒకటి ఆర్పీపీ నుంచి ఉన్నాయి.

Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

ఈ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీపీపీ కలిసి పని చేయబోతున్నాయి. రెండు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకున్నాయి. ఈ లెక్కన బీజేపీ 20 సీట్లలో, ఎన్డీపీపీ 40 సీట్లలో పోటీ చేస్తోంది. వీటిలో చాలా వరకు అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ సహా మిగతాపార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే, నామినేషన్లు మాత్రం దాఖలు కావడం లేదు. మంగళవారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు