Squirrel Play With Humans
Squirrel Play With Humans : బుజ్జి బుజ్జిగా క్యూట్ గా ఉండే ఉడుతలు. కదిలితే కుచ్చులాంటి వాటి తోక అటూ ఇటూ కదులుతుంటుంది. వాటి కళ్లు చక్రాల్లా తిరుగుతుంటాయి. ఆ కొమ్మమీద నుంచి ఈ కొమ్మమీదకు దూకుతుంటాయి. అలా గంతులు వేస్తూ ఆడుకునే ఉడుతని చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. కానీ పట్టుకోవాలంటే మాత్రం దొరకవు. ఇట్టే పారిపోతాయి. కానీ అటువంటి ఓ ఉడుత మనుషుల మధ్య తిరుగుతు చక్కగా ఆడుకుంటోంది. ఆ ఇంటిలో వాళ్లు ఎక్కడకు తిరిగితే వారి వెంటనే తిరుగుతోంది. భుజాలమీదకు ఎక్కి ఆడుకుంటోంది. తలమీదకు దూకుతో తెగ సందడి చేస్తోంది. మనుషుల్ని చూస్తే చాలు ఉరికి పారిపోయే ఉడుత మనుషుల మధ్య ఎలా భయం లేకుండా తిరుగుతోదంటే..
Read more : Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు
చెట్లపై తిరగుగుత ఆడుకునే ఓ చిన్ని ఉడుత బుజ్జి ఉడత పిల్ల పాపం కాకుల బారిన పడింది. ఆ ఉడుత పిల్లని కాకులు పొడిచి పొడిచి చంపబోతున్నాయి. అంతలో ఓ బాలుడు చూశాడు. అయ్యో..మాయదారి కాకులు బుజ్జి ఉడుత పిల్లని చంపేస్తున్నాయే..అని జాలిపడ్డాడు. కాకుల్ని తరిమేసి ఉడుత పిల్లను కాపాడాడు. దీంతో ఆ ఉడుత వారితోనే ఉంటోంది. వారితో చక్కగా ఆడుకుంటోంది.
సూర్యాపేట మండలం జనగామ క్రాస్‌రోడ్డులో నివాసముంటున్న షేక్ ఖలీం–హలీమా దంపతుల కొడుకు అస్లం 8వ తరగతి చదువుతున్నాడు. రెండునెలల క్రితం అస్లం ఓ రోజు జనగామ క్రాస్ సమీపంలోని పిల్లలమర్రి రోడ్డులో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో నాలుగైదు కాకులు ఓ చిన్న ఉడుత పిల్లను పొడుస్తుండగా చూశాడు. రక్తం కారుతున్న ఆ ఉడుతను చూసి చలించిపోయిన అస్లం కాకుల్ని తరిమేసి దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు.
Read More: వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!
దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అస్లంతో పాటు వారి ఇంటిలోవాళ్లు కూడా ఉడుత ఆలనా పాలనా చూసేవారు. అలా కొన్ని రోజులకు ఆ ఉడుత పిల్ల గాయాలుతగ్గాయి. కానీ అది అక్కడినుంచి వెళ్లిపోలేదు.అప్పటినుంచి ఇంట్లోనే ఉంటోంది. దీంతో దాన్ని ఇంట్లోవారంతా పెంచుకుంటున్నారు. గింజలు వేస్తు..దానికి ఆహారం పెడుతు చాలా ముద్దు ముద్దుగా చూసుకుంటున్నారు. అలా ఆ ఉడుత ఆ ఇంటి వాళ్లకు బాగా అలవాటైపోయింది. ఈ ఉడుత చాలా చిలిపిది. ఇంట్లో వారి భుజాలమీదకు తలమీదకు ఎక్కుతు తెగ ఆడుకుంటోంది.