Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు

బ్లాక్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి రెండు బయోకాన్ నేమ్ బోర్డులపై బ్లాక్ పెయింట్‌ను స్ప్రే చేశాడు..

Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు

కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు అధికంగా అవకాశాలు కల్పించాలని అక్కడి కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన బిల్లుపై ఇప్పటికీ దుమారం రేగుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వారే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా ఆ బిల్లుపై మండిపడుతున్నాయి.

బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ కంపెనీ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ఇటీవల దీనిపై స్పందిస్తూ.. కర్ణాటకలో ప్రతిపాదిత జాబ్ కోటా విధానం నుంచి బాగా నైపుణ్యాలు ఉన్న కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు.

దీంతో తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తు బయోకాన్ నేమ్ బోర్డులపై బ్లాక్ పెయింట్ వేస్తూ వీడియోలు తీసుకోవడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి రెండు బయోకాన్ నేమ్ బోర్డులపై బ్లాక్ పెయింట్‌ను స్ప్రే చేశాడు.

కాగా, బిల్లు ప్రకారం.. ఆ రాష్ట్రంలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో మెనేజ్‌మెంట్ స్థాయిలో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అలాగే, నాన్ మెనేజ్‌మెంట్ స్థాయిలో 70 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్థూలకాయంతో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా?