DMK On Governor: తమిళనాడు పేరు మార్పుపై గవర్నర్ క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గని డీఎంకే

తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్‭భవన్‭లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు.

DMK On Governor: తమిళనాడు పేరును ‘తమిళగం’గా మార్చాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలపాలైన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. వాస్తానికి తాను అంత లోతుగా ఆలోచించలేదని, తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే అందుకు క్షమాపణ చెబుతున్నానని బుధవారం ప్రకటించారు. ఇక్కడికి ఈ కాంట్రవర్సీ ముగిసిందని అనుకున్నారు. అయితే అధికార డీఎంకే పార్టీ మాత్రం గవర్నర్ క్షమాపణ చెప్పినా తగ్గడం లేదు. రాష్ట్ర పేరు మార్చడం గవర్నర్ ఆలోచన కాదని, వాస్తానికి ఆయన ఆలోచన వేరే ఉందంటూ ఆర్.ఎన్ రవి క్షమాపణ చెప్పిన మర్నాడు డీఎంకే అధికార ప్రతినిధి ఎస్.ఎలంగోవన్ అన్నారు.

Sajjanar: అధిక డబ్బుకు ఆశపడితే అంతే.. అలాంటి సంస్థల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించిన సజ్జనర్

‘‘రాష్ట్రనికి పేరు మార్పు విషయంలో గవర్నర్ ఉద్దేశాలేంటో నాకు తెలియదు. అయితే రాష్ట్ర పేరు మార్పు కాకుండా, ఆయన వ్యాఖ్యలు, తీరు వెనుక ఉద్దేశాలేంటో బాగా తెలుసు. డీఎంకేను విభజిత పార్టీగా చూయించే ప్రయత్నంలో భాగంగా గవర్నర్ ప్రవర్తిస్తున్నాను. ప్రత్యేక దేశం కోరుకునే పార్టీగా డీఎంకేను చూపించాలని అనుకుంటున్నారు. వాస్తవానికి మేము ప్రత్యేక దేశమేమీ కోరుకోవడం లేదు. సమాఖ్య వ్యవస్థలో భాగంగా మాకు మరిన్ని అధికారాలు కావాలని కోరుతున్నాం’’ అని అన్నారు.

Nitish Kumar: నాకున్నది ఆ ఒక్క ఆశ మాత్రమే.. కేసీఆర్ మీటింగ్ మరుసటి రోజు నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్‭భవన్‭లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. దీంతో అధికారంలో ఉన్న డీఎంకే సహా తమిళ రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ మీద నిప్పులు చెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు