ఇంగ్లీష్ వచ్చు..కానీ అంటూ ట్రంప్ సెటైర్లు..నిజంగానే కొట్టిన మోడీ

సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్మీర్ విషయంలో తాము తల దూర్చడం లేదని ట్రంప్ సృష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సమావేశం సందర్భంగా ఓ ఆశక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ట్రంప్ ఇంగ్లీషులో మాట్లాడగా మోడీ హిందీలో మాట్లాడారు. మోడీ ట్రంప్ పక్కపక్కన కూర్చొని ఉన్న సమయంలో మోడీ మీడియా ప్రతినిధులతో హిందీలో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ మధ్యలో కలుగజేసుకున్నారు.

వాస్తవానికి మోడీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు కానీ ఎందుకో హిందీలో మాట్లాడుతున్నారని ట్రంప్ అనగానే నవ్వులు ఇద్దరు దేశాధినేతల మధ్య నవ్వులు పూశాయి. ట్రంప్ మాటలతో హర్ట్ అయినట్లు కన్పించిన మోడీ  వెంటనే ట్రంప్ చెయ్యిని పట్టుకుని గట్టిగా తట్టారు. ట్రంప్ కూడా కొద్ది సేపటి తర్వాత నేనేం తక్కువ అన్నట్లుగా మోడీ చేతిని తాకి వదిలేశారు.