Nashik : టమాట కిలో రూ. 3..రోడ్లపై పారపోస్తున్నారు, రైతు కన్నీరు
కంటికి రెప్పలా కాపాడిన పంటను రోడ్లపై పారపోస్తూ..తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Nashik Farmers Dump Tomatoes On Road
Farmers Dump Tomatoes On Road : టమాట కిలో రూ. 3 మాత్రమే..అంటే ఎక్కడ ఓ రెండు, మూడు కిలోలు కొనొచ్చు అని అనుకుంటున్నారా ? కానీ పండించిన పంటను రోడ్లపై పారపోస్తున్నారు. ఆరుగాలం శ్రమించారు..కష్టపడ్డారు. ఎంతో వ్యయప్రయాసల కోర్చి..పంటను పండించారు. కానీ….తీరా పంటను అమ్ముకొందామని వెళితే…కిలో రెండు రూపాయలన్నారు. అప్పుడు ఆ రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి.
Read More : Shilpa Shetty: నేను తప్పు చేశా.. కానీ అది సరైనదేనని అనుకుంటున్నా!
కనీసం పండించిన పంటకు అయిన ఖర్చు కూడా రాకపోవడంతో గుండెలనిండా బాధ వ్యక్తమైంది. ఆ రైతుల కళ్లల్లో ఎరుపు చారలు కమ్ముకున్నాయి. కళ్లనిండా కోపం.. ఏమీ చేయలేని నిస్సహాయత. దీంతో ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడిన పంటను రోడ్లపై పారపోస్తూ..తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ టమాట రైతులు గిట్టుబాటు ధరలేక పండించిన పంటను నేలపాలు చేస్తున్నాడు.
Read More : Wife Viral Shopping List :ఏ భార్యా ఇంత డిటెయిల్‌గా భర్తకు షాపింగ్ లిస్టు ఇచ్చి ఉండదేమో..!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఏకంగా టమాటా ధర దారుణంగా పడిపోయింది. కిలో టమాట ధర కేవలం 2 రూపాయలే పలుకుతోంది. రెండు వారాల క్రితం వరకు 30 నుంచి 40 రూపాయలు పలికింది. గత వారం 25 రూపాయలుగా ఉంది. 2021, ఆగస్టు 27వ తేదీ శుక్రవారం కిలో టమాటా ధర ఏకంగా 2 రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు.. అధికారులపై కన్నెర్ర జేశారు. పంట పెట్టుబడి దేవుడెరుగు…కనీసం రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో తీసుకొచ్చిన టమాటాను నేలపై పోసి నిరసన తెలిపారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
Read More :Ecil Jobs : ఈసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీ
అటు ఔరంగాబాద్‌లోనూ సేమ్ సీన్ కనిపించింది. ఔరంగాబాద్ మార్కెట్‌లోనూ టమాటా ధర 3 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు తీసుకొచ్చిన టమాటాను మార్కెట్‌లో పోశారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. టమాటా దండలతో బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెట్‌లో టమాటా పంటంతా పడపోయడంతో.. ఎక్కడ చూసినా టమాటా కుప్పలే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో టమాటాలను జేసీబీతో క్లియర్ చేస్తున్నారు మార్కెట్ అధికారులు.
Read More : Ram Gopal Varma: సుల్తానాతో వర్మ.. మరో వీడియో వైరల్!
ఇటు అనంతపురం జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేకపోవడంతో అన్నదాతలు దిగాలు పడ్డారు. అప్పులు చేసి సాగు చేస్తే టమాటాకు ధర లేకపోవడంతో రోడ్లపై పారబోసే పరిస్థితి నెలకొంది. మరికొందరు పోలంలోనే వదిలేస్తున్నారు. జిల్లాలోని రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం , రాయదుర్గం తదితర ప్రాంతాల్లో విస్తారంగా టమాటా సాగైంది. ఈసీజన్‌లో సకాలంలో వర్షాలు కురవడంతో రైతుల ఈ పంట వేశారు. దిగుబడి ఇబ్బడిముమ్మడిగా రావడంతో ధరలు పతనమయ్యాయి. నల్లమాడ మండలం పాత బత్తలపల్లి కి చెందిన ఓ రైతు రెండు ఎకరాల్లో టమాటా సాగుకు రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ధర లేకపోవడంతో నష్టం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా ? వారికి న్యాయం చేస్తారా ? అనేది చూడాలి.