#NationalUnemploymentDay
#NationalUnemploymentDay: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మ దినోత్సవాన్ని ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’గా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కేరళలోని కొల్లాంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను చాలా మంది నిరుద్యోగులు కలిశారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొని తమకు ఉద్యగాలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ హామీని మర్చిపోయిందని విమర్శించారు. ”యువతకు ఉద్యోగాలు కావాలి.. మన యువతకు మంచి నాయకత్వం కావాలి. మన యువతకు భరోసా కావాలి” అని ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’ జరుపుతున్నారు.
యువతకు బూటకపు హామీలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీజేపీ మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలోని పలు జిల్లాల కేంద్రాల్లో నిరుద్యోగులకు మద్దతుగా నిరసన చేపట్టారు. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో యాత్ర’ కేరళలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర వాసుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. రాహుల్ వెంట పలువురు స్థానిక నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు.
India’s Active caseload: దేశంలో కొత్తగా 5,747 మందికి కరోనా.. ప్రస్తుతం 46,848 యాక్టివ్ కేసులు