India’s Active caseload: దేశంలో కొత్తగా 5,747 మందికి కరోనా.. ప్రస్తుతం 46,848 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 5,747 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,618 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 46,848 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.74 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.

Corona
India’s Active caseload: తెలంగాణలో కొత్తగా 5,747 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,618 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 46,848 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.74 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,39,53,374 నమోదయ్యాయని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 216.41 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో రెండో డోసులు 94.64 కోట్లు ఉండగా, 19.35 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది. నిన్న దేశ వ్యాప్తంగా 23,92,530 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కలిపి 89.12 కోట్ల కరోనా పరీక్షలు చేశారని చెప్పింది. అలాగే, నిన్న 3,40,211 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది.
Rainfall alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం