Navjot Singh Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేశారు. 

Navjot Singh Sidhu : పంజాబ్ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలు.. పంజాబ్ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. తాజాగా… పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య విభేదాలతో ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితి రచ్చకెక్కింది. చన్నీకి సీఎం పదవి దక్కడంతో.. కండిషన్స్ మరింత దిగజారాయి.

Punjab Politics : పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కెప్టెన్ సాబ్?

కాంగ్రెస్ బాధ్యతలను తాత్కాళికంగా చూస్తున్న అధినేత్రి సోనియాగాంధీకి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. రాజీపడితే క్యారెక్టర్ నాశనమైనట్టేనని రాజీనామా లేఖలో చెప్పారు. పంజాబ్ భవిష్యత్తు,   రాష్ట్ర సంక్షేమం విషయాల్లో తాను ఎన్నడూ రాజీ పడలేదన్నారు. అందుకే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ లో కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు.

 

ఈ ఉదయమే కెప్టెన్ అమరీందర్ సింగ్ షాక్

పంజాబ్ లో ఇటీవల ముఖ్యమంత్రిని మార్చిన కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తాజా మాజీ ముఖ్యమంత్రి.. కెప్టెన్ అమరీందర్ బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంకేతంగా.. ఇవాళ  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కెప్టెన్ భేటీ కానున్నట్టు సమాచారం.

Punjab : ఆదిలోనే అమరీందర్ కి షాక్ ఇస్తున్న సీఎం చన్నీ
కెప్టెన్ అమరీందర్… సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో మరో సీనియర్ నాయకుడు సిద్ధూతో విభేదాలు.. పోయిన పదవి.. కొత్త సీఎంగా చరణ్ జిత్ చన్నీ ప్రమాణం వంటి పరిణామాలతో.. ఆయన కొంత కాలంగా సీరియస్ గా ఉన్నారు. కొత్త పార్టీ పెడతారా.. బీజేపీలో చేరతారా.. అన్న మీడియా ప్రశ్నలకు.. ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తన అనుచరులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు.

ట్రెండింగ్ వార్తలు