Punjab : ఆదిలోనే అమరీందర్ కి షాక్ ఇస్తున్న సీఎం చన్నీ

  నాలుగు రోజుల క్రితం పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్‌ సింగ్‌ చన్నీ..పాలనలో తనదైన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. పలు నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం

Punjab : ఆదిలోనే అమరీందర్ కి షాక్ ఇస్తున్న సీఎం చన్నీ

Channi

Punjab  నాలుగు రోజుల క్రితం పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్‌ సింగ్‌ చన్నీ..పాలనలో తనదైన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. పలు నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ కు షాకులు కూడా ఇస్తున్నారు. అమరీందర్ సింగ్‌ గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరుపుతున్న సీఎం చన్నీ… కెప్టెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియమించిన 13 మంది ఓఎస్డీలు, సలహాదారులను ఉద్యోగం నుంచి తొలగించారు.

అంతటితో ఆగకుండా 15 రోజుల్లోగా ప్రభుత్వ వసతిగృహాలను ఖాళీ చేయాలని వారికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం అందించిన అన్ని రకాల సదుపాయాను తిరిగివ్వాలని సూచించారు. 113 మందిలో ఐదుగురు ఇప్పటికే రాజీనామా చేశారు. కాగా, 13 మంది ఓఎస్డీలు, సలహాదారులను నియమించిన పంజాబ్ సర్కార్ ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. దుబారాను తగ్గించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందనే వాదనను కొట్టిపారేసేందుకే సీఎం చన్నీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇక, కెప్టెన్‌కు ఇచ్చిన ప్రభుత్వ వాహనం, భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారు.

సీఎం విమాన ప్రయాణ వివాదం

మరోవైపు,కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు మరో ఇద్దరితో కలసి సీఎం చన్నీ..చార్టెడ్ ఫ్లయిట్‌లో ఢిల్లీకి వెళ్లడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. సాధారణ ఫ్లయిట్‌లోనో లేదా కార్‌లోనో వెళ్లకుండా ఖరీదైన ప్రైవేట్ జెట్‌లో ఎందుకు వెళ్లారంటూ చన్నీపై విపక్షాలు మండిపడుతున్నాయి. నలుగురు వెళ్లడానికి 16 మంది కూర్చునే జెట్‌ను ఎందుకు వాడారని సీఎం చన్నీపై విరుచుకుపడుతున్నాయి విపక్షాలు.

ప్రభుత్వం వద్ద అధికారికంగా 5 సీటర్ చాపర్ అందుబాటులో ఉన్నా.. దాన్ని ఎందుకు వాడటం లేదని ప్రశ్నిస్తున్నాయి. చండీగఢ్ నుంచి ఢిల్లీకి 250 కిలో మీటర్ల దూరం. .అంత తక్కువ దూరం జర్నీకి మామూలు ఫ్లయిట్ లేదా కార్లను వాడాల్సింది.. గాంధీ ఫ్యామిలీ పాటించే ఢిల్లీ దర్బార్ సంస్కృతిని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా? అని శిరోమణి అకాలీదళ్ ప్రశ్నించింది. ఈ విషయంపై సీఎం చన్నీని పలువురు రిపోర్టుర్లు ప్రశ్నించగా ఆయన సీరియస్ అయ్యారు. పేదోడు ఫ్లయిట్‌ ఎక్కొద్దా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఫ్లయిట్ చార్జీలు ఎవరు చెల్లించారని అడగ్గా.. సమాధానం చెప్పకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు.

READ Amarinder Singh..సిద్ధూ దేశానికే డేంజర్..కాంగ్రెస్ కి 10 సీట్లు కూడా కష్టమే!