Punjab Politics : పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కెప్టెన్ సాబ్?

బీజేపీ అగ్రనేతలతో కెప్టెన్ అమరీందర్ భేటీ కానున్నరాన్న వార్తలు.. పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Punjab Politics : పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కెప్టెన్ సాబ్?

Captain

Updated On : September 28, 2021 / 2:08 PM IST

Punjab Politics : పంజాబ్ లో ఇటీవల ముఖ్యమంత్రిని మార్చిన కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తాజా మాజీ ముఖ్యమంత్రి.. కెప్టెన్ అమరీందర్ బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంకేతంగా.. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కెప్టెన్ భేటీ కానున్నట్టు సమాచారం.

Punjab : ఆదిలోనే అమరీందర్ కి షాక్ ఇస్తున్న సీఎం చన్నీ
కెప్టెన్ అమరీందర్… సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో మరో సీనియర్ నాయకుడు సిద్ధూతో విభేదాలు.. పోయిన పదవి.. కొత్త సీఎంగా చరణ్ జిత్ చన్నీ ప్రమాణం వంటి పరిణామాలతో.. ఆయన కొంత కాలంగా సీరియస్ గా ఉన్నారు. కొత్త పార్టీ పెడతారా.. బీజేపీలో చేరతారా.. అన్న మీడియా ప్రశ్నలకు.. ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తన అనుచరులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు.

Punjab : దళిత నేతను వరించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి
ఇప్పుడు బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నరాన్న వార్తలు.. పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం.. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో.. ఈ సాయంత్రం.. అమిత్ షా, నడ్డాతో భేటీ తర్వాత.. కెప్టెన్ అమరీందర్ ఫ్యూచర్ పాలిటిక్స్ పై స్పష్టత రానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. అమరీందర్ సింగ్ రాజకీయం కీలకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.