Naxals Leader Surrendered : పోలీసులకు లొంగిపోయిన నక్సల్స్ కీలక నేత.. అతని తలపై రూ.19 లక్షల రివార్డు

జార్ఖండ్ లో నక్సల్స్ కీలక నేత, సీపీఐ మావోయిస్టు ఆర్గనైజర్ రీజనల్ కమాండర్ అమన్ గంఝు ఇవాళ జార్ఖండ్ పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. అమన్ గంఝు తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది.

JHARKHAND

Naxals Leader Surrendered : జార్ఖండ్ లో నక్సల్స్ కీలక నేత, సీపీఐ మావోయిస్టు ఆర్గనైజర్ రీజనల్ కమాండర్ అమన్ గంఝు ఇవాళ జార్ఖండ్ పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. అమన్ గంఝు తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది. అమన్ గంఝును పట్టించే వారి కోసం జార్ఖండ్ ప్రభుత్వం రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది.

అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరో రూ.4లక్షల రివార్డు ప్రకటించింది. ఆపరేషన్ ఐజీ ఏవీ హోమ్ కర్, రాంచి జోనల్ ఐజీ పంకజ్ కంబోజ్, గర్హ్వా ఎస్పీ అంజనీ ఝా సమక్షంలో అమన్ గుంఝు లొంగిపోయాడు.

Janashakthi Naxals : తెలంగాణలో జనశక్తి నక్సల్స్ కదలికలు

జార్ఖండ్ లోని లతేహర్, లొహర్ డగ, గుమ్లా ఏరియాల్లో గంఝు కీలక పాత్ర పోషించారు. 2004లో ఆయన మావోయిస్టు ఆర్గనైజేషన్ లో చేరారు. అతనిపై మొత్తం 17 కేసులు ఉన్నాయి. వీటిలో గర్హ్వా జిల్లాలో 10 కేసులు, లతేహర్ జిల్లాలో 7 కేసులు నమోదు అయ్యాయి.