Janashakthi Naxals : తెలంగాణలో జనశక్తి నక్సల్స్ కదలికలు

గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు ఆరంభ మయ్యాయి.

Janashakthi Naxals : తెలంగాణలో జనశక్తి నక్సల్స్ కదలికలు

Janashakthi Naxals

Janashakthi Naxals : గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు ఆరంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం జరుపుకున్నారు. సుమారు 80 మంది ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో జనశక్తి నక్సల్స్ కదలికల పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

పార్టీ సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లోని పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్‌లో 8మంది సాయుధ జనశక్తి నక్సల్స్, 72 మంది సానుభూతిపరులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపెట్, గంభీరావుపేట్, ముస్తాబాద్‌కు చెందిన మాజీలు హాజరయ్యారు.

Also Read : Qatar Airways : ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్
గత కొతం కాలంగా పార్టీకూడా ఎటువంటి కార్యకలాపాలునిర్వహించకుండా స్తబ్దుగా  ఉంది. పార్టీ వ్యవస్దాపకులు కూర రాజన్న, కూర అమర్ లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన మాజీ నక్సల్స్ ను విశ్వనాధ్ పిలిపించుకుని మాట్లాడారు. జనశక్తి మీటింగ్ కు వెళ్లిన మాజీలను పోలీసులు‌ ప్రశ్నిస్తున్నారు.