Bijapur Naxal Encounter : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

బెటాలియన్ల సంయుక్త బృందం కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.

Bijapur Naxal Encounter : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. DRG, STF, కోబ్రా 202, CRPF 222 బెటాలియన్ల సంయుక్త బృందం కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య 8 గంటలుగా కాల్పులు కొనసాగుతున్నాయి.

Also Read : పండుగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్లు, టీవీలు.. చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. జవాన్లు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. అదే సమయంలో వారికి మావోయిస్టులు కనిపించారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

Also Read : మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..

ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. డిస్ట్రిక్ రెవెన్యూ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ కు చెందిన దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేట్టాయి.