Budget 2025: మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..

మీకు పడే ట్యాక్స్ గురించి మీలో గందరగోళం నెలకొందా?

Budget 2025: మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..

Representative image

Updated On : February 1, 2025 / 3:41 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట ఇచ్చారు. ట్యాక్స్‌ రిబేబ్‌ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన విషయం తెలిసిందే.

అదనంగా రూ.75 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ను కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. అయితే, మళ్లీ ఈ ట్యాక్స్ 5 శాతం, 10 శాతం అంటూ ఉన్న స్లాబ్స్ ఏంటనే గందరగోళం చాలా మందిలో ఉంది. ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలకు మించితే కొత్త స్లాబ్స్‌ ప్రకారం ఈ కింది పన్నులను లెక్కిస్తారు.

Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌.. మామూలుగా లేవుగా..

మీకు రూ.12 లక్షల కంటే అధిక వార్షిక ఆదాయం ఉంటే ఆ మొత్తాన్ని స్లాబ్స్‌గా విభజిస్తారు. ఆ తర్వాతే మీకు వేయాల్సిన పన్నులను గణిస్తారు. ఉదాహరణకు మీ ఆదాయం రూ.20 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది.

అంటే మీరు 19.25 లక్షలపై కట్టే పన్నులో స్లాబ్స్‌ను విభజించాలి. ఈ విధంగా రూ.4 లక్షలలోపు వాటికి పన్ను ఏమీ కట్టొద్దు. రూ.4 నుంచి 8 లక్షల మధ్య కట్టాల్సిన పన్ను 5 శాతం ఉంది కాబట్టి రూ.20,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.8 లక్షలు-రూ.12 లక్షల మధ్య 10 శాతం పన్నుగా నిర్ణయించారు కాబట్టి మీరు రూ.40,000 పన్ను కట్టాలి.

అలాగే, రూ.12 లక్షలు-రూ.16 లక్షల మధ్య 15 శాతం పన్ను ఉంది కాబట్టి రూ.60,000 పన్ను భారం పడుతుంది. రూ.16 లక్షలు -రూ.20 లక్షల మధ్య 20 శాతం పన్నును కట్టాల్సి ఉంటుంది కాబట్టి రూ.65,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. అంతేగానీ, వ్యక్తిగతంగా సంవత్సరానికి రూ.12 లక్షల వరకు సంపాదించే వారు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

పైన మీ ఆదాయం రూ.20 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే ఎంత పన్ను కట్టాల్సి వస్తుందన్న లెక్కలు ఇచ్చాం. అంతకంటే వార్షిక ఆదాయం ఎక్కువ/తక్కువ ఉన్నవారికి ట్యాక్స్ కట్ అవుతుందో ఈ కింది టేబుల్‌లో చూసుకోవచ్చు..