అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యం : అజిత్ పవార్ కు స్వయంగా ఆహ్వానం పలికిన సుప్రియా సూలే

బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ

  • Publish Date - November 27, 2019 / 03:48 AM IST

బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ

బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ తర్వాత సభ్యులు స్పీకర్ ని ఎన్నుకుంటారు. సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కొత్త ఎమ్మెల్యేలకు స్వయంగా ఆహ్వానం పలికారు. వారికి అభివాదం చేశారు.

ఇక సొంత గూటికి చేరిన అజిత్ పవార్ ని సోదరి సుప్రియూ సూలే ఆప్యాయంగా పలకరించారు. తన సోదరిని అజిత్ పవార్ ఆలింగనం చేసుకుని సంతోషం తెలిపారు. శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేని కూడా పలకరించారు సుప్రియా సూలే. బీజేపీ నేత ఫడ్నవిస్, సుప్రియా సూలే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపించింది. అంతకుముందు శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహారాష్ట్రలోని ప్రతి పౌరుడు మద్దతుగా నిలిచారని సుప్రియా సూలే అన్నారు. ప్రజలు తమకు కొత్త బాధ్యతలు అప్పగించారని చెప్పారు. వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.