Mumbai: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‭ను చంపుతామంటూ బెదిరింపులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‭కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్‭ ఇల్లైన సిల్వర్ ఓక్‭కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా, ఈ వ్యక్తి బిహార్‭కు చెందినవాడు. ఇంతకు ముందు కూడా పవార్ ఇంటికి ఫోన్ చేసి ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు

NCP president Sharad Pawar gets death threat

Mumbai: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‭కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్‭ ఇల్లైన సిల్వర్ ఓక్‭కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా, ఈ వ్యక్తి బిహార్‭కు చెందినవాడు. ఇంతకు ముందు కూడా పవార్ ఇంటికి ఫోన్ చేసి ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పట్లో అతడిని అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు. విడుదలైన అనంతరం మళ్లీ ఇలా బెదిరింపులకు తెగబడ్డాడు. సదరు వ్యక్తిని తొందరలో పట్టుకుంటామని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఆ వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ చట్టంలోని సెక్షన్ 294, 506(2) కింద కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

India-China Border Clash At LAC : చైనా దాడిని మోడీ ఎప్ప‌టికీ అంగీక‌రించ‌రు..అరుణాచ‌ల్ ఘటనపై కూడా ఓ కొత్త కథ చెబుతారు : MP అస‌దుద్దీన్ ఓవైసీ