పీకే జోస్యం : 2019లో ఆయనే ప్రధాని

మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై, మరోసారి మోడీ ప్రధాని భాధ్యతలు చేపడతారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ ఆయన ప్రధాని రేసులో ఉండరన్నారు.  బీజేపీకి పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీష్ అభ్యర్థిత్వం సాథ్యంకరాకపోవచ్చన్నారు. ఇటీవల మతోర్సీలో శివసేన అధ్యుడు ఉద్దవ్ ఠాక్రే, ఇతర శివసేన నాయకులతో ప్రశాంత్ కిషోర్ భేటీపై జేడీయూ, బీజేపీ జట్టు కట్టబోతున్నాయంటూ భిన్న కథనాలు వినిపిస్తున్న సమయంలో దీనిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్..ఎన్డీయేలో శివసేన, జేడీయూ భాగస్వాములుగా ఉన్నాయని అన్నారు.

 

ఒకవేళ ఠాక్రేకు ఏదైనా రాజకీయ సహాయం అవసరమైతే దానికి తాను బద్దుడినై పనిచేస్తానని తెలిపారు. మరాఠా అనుకూల పార్టీలు యూపీ, బీహార్ ల నుంచి వచ్చి మహారాష్ట్రలో నివసిస్తున్న వలస కార్మికుల మనో భావాలు దెబ్బతీస్తున్న విషయం గురించి తాను శివసేన నేతలతో చర్చించినట్లు తెలిపారు.
 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

ట్రెండింగ్ వార్తలు