NDA Meeting: ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం.. రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు..

NDA Meeting: NDA Meeting: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోదీ, సైన్యాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయగా.. దేశవ్యాప్తంగా కుల జన గణన చేపట్టడం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరో తీర్మానం చేయగా.. రెండు తీర్మానాలని ఎన్డీయే పక్ష నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఎన్డీయే కూటమి మూడో టర్మ్ లో ఏడాది పాలనపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా చంద్రబాబు అటెండ్ అవ్వలేకపోయారు. దీంతో ఏపీ తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సాయుధ దళాల పరాక్రమాన్ని, ఆపరేషన్ సిందూర్ ను, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఈ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. శివసేన నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రతిపాదించిన తీర్మానం ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

కుల గణన, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుకునే వేడుకలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలపై ఈ సమావేశం చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో అమలవుతున్న కీలక పథకాలపై ప్రజంటేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి మృతులకు ఎన్డీయే సమావేశంలో నివాళి అర్పించారు.

Also Read: ట్రంప్ 25శాతం టారిఫ్‌ విధించినా నో ప్రాబ్లమ్..! ఇండియాలో ఐఫోన్‌లు అమెరికాతో పోలిస్తే చాలాచౌక.. ధరల్లో తేడా ఇలా.. వెల్లడించిన జీటీఆర్ఐ నివేదిక

తమ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే. ఆయన ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతిచ్చారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌.. ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందన్నారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత ఎన్డీయే సమావేశం జరగడం ఇదే తొలిసారి.